English | Telugu

ర‌వితేజ తో ఆర్ ఎక్స్ ద‌ర్శ‌కుడు!!

on Jun 7, 2019

 

`ఆర్ ఎక్స్ 100` చిత్రంతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమా వ‌చ్చి చాలా కాల‌మైనా ఈ ద‌ర్శ‌కుడి రెండో సినిమా మాత్రం సెట్స్ మీద‌కు ఇంకా వెళ్ల‌లేదు.  రామ్ తో పాటు మ‌రో హీరోతో ఒక మ‌ల్టీస్టార‌ర్ చేద్దామ‌నుకున్న ఈ ద‌ర్శ‌కుడు ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రే అని బెల్లంకొండ శ్రీనివాస్ తో చేద్దామ‌ని కొంత కాలం వెయిట్ చేసాడు. అది కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక నాగ‌చైత‌న్య , అజ‌య్ భూప‌తి సినిమా అంటూ ఆ మ‌ధ్య వార్త‌లు కూడా వ‌చ్చాయి. అది కూడా గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక ఎట్ట‌కేల‌కు అజ‌య్ భూప‌తి సినిమా మాస్ రాజా ర‌వితేజ‌తో ఓకే అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రానికి `మ‌హాస‌ముద్రం` టైటిల్ కూడా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది.  ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పాట‌లు కూడా చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీత సార‌థ్యంలో ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ ప‌తాకంపై పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన న్యూస్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ `డిస్కోరాజా` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తైన వెంట‌నే `మ‌హాస‌ముద్రం`లో పాల్గొంటాడ‌ట‌. 

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here