English | Telugu

`వాల్మీకి` వ‌చ్చేదెప్పుడంటే!!

on Jun 10, 2019

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `వాల్మీకి`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `జిగ‌ర్తాండా` చిత్రానికిది అఫీషియ‌ల్ రీమేక్. తెలుగు  ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టుగా స్టోరిలో కొన్ని ఛేంజెస్ చేసి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌. త‌మిళంలో బాబీ సింహా చేసిన గ్యాంగ్ స్టార్ పాత్ర‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు.  కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన క‌థానాయ‌కుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ముకుంద‌, కంచె, అంత‌రిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ క‌థానాయ‌కుడు.  అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో దిట్ట డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌.ఎస్.... సూప‌ర్ హిట్ చిత్రాలు `మిర‌ప‌కాయ్‌`, `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`, ఇండ‌స్ట్రీ హిట్ `గ‌బ్బ‌ర్ సింగ్‌`, సెన్సేష‌న‌ల్ హిట్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌` వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్సే హ‌రీష్ మేకింగ్‌కు ఉదాహ‌ర‌ణ‌లు.  వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here