English | Telugu
సినిమా పేరు: యుద్ధ శరణం
బ్యానర్ : వారాహి చలన చిత్రం
Rating : 1.50
విడుదలయిన తేది : Sep 8, 2017
Facebook Twitter Google

తారాగణం:- నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రేవతి, రావురమేశ్...
దర్శకత్వం:- కృష్ణ మరిముత్తు
నిర్మాత:- సాయి కొర్రపాటి

మనకు అభిరుచి అనేది ఏడిస్తే... మనం చేసే పని మనకు నచ్చితే... అది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఓ వ్యాసం కావొచ్చు.. ఓ చిత్రలేఖనం కావొచ్చు... ఓ శిల్పం కావొచ్చు.. ఏదైనా సరే.  చేస్తున్నప్పుడే... సరిగ్గా వస్తుందో రావట్టేదో అర్థమైపోతుంది. వాటి విషయంలో వెంటనే జాగ్రత్త పడతే సరిచేసుకోవచ్చు. పెద్దగా ఖర్చులేని వ్యవహారం కదా. కానీ... సినిమా విషయంలో అలాకాదు. ఆ జాగ్రత్త ఏదో ముందే పడాలి. పక్కాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని సంతృప్తి చెందాకే... సెట్స్ కి వెళ్లాలి. అది దర్శకుడి లక్షణం. కానీ కొంతమంది అలా చేయడం లేదు. డైరెక్ట్ గా సెట్స్ కి వెళ్లిపోయి... అనిపించింది తీసేసి... తీరా... అవుట్ పుట్ రోతగా వస్తుందనే విషయం అర్థమవ్వగానే.. గందరగోళం అయిపోయి.. చేసిది లేక... సినిమాను చుట్టేసి.. చేతులెత్తేస్తున్నారు. ఫలితం... నిర్మాత నెత్తిన చెంగు. వీళ్లను ‘దర్శకులు’ అనకూడదు. కొత్త పేరేదైన పెట్టాలి. నిర్మాతల పాలిటి సింహ స్వప్నాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఈ శుక్రవారం ‘యుద్ధ శరణం’అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా గురించి చెప్పేముందు.. ఎందుకో ఇవన్నీ చెప్పాలనిపించింది.

కథ:

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ మురిముత్తు దర్శకుడు.  సాయి కొర్రపాటి నిర్మాత.  ఈ సినిమా ఎలావుందో చెప్పేముందు కథ గురించి చెప్పుకుందాం అమ్మానాన్న.. వారికి యోగ్యుడైన కొడుకు. అప్పుడప్పుడూ వచ్చిపోయే ఇద్దరు కూతుర్లు.. ఇలా ఓ అందమైన కుటుంబం. వారి కుటుంబంలోకి ఇంకో కొత్తమ్మాయ్ కోడలుగా వచ్చే శుభసమయం ఆసన్నమైంది. ఇల్లంతా సరదాలతో, సరాగాలతో ఉల్లాసంగా ఉంది. అలాంటి సమయంలో అమ్మానాన్నా ఓ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొని కొందరు కిరాతకుల చేతుల్లో హత్యకు గురయ్యారు. తన కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఆ దుండగలను హీరో తుదముట్టిస్తాడు. ఇదే కథఎనాలసిస్ :

ఈ కథను  ‘పాత చింతకాయపచ్చడి’ అంటే సరికాదు. ఎందుకంటే... పాత చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కథ పాతదైన నడక బావుంటే... దాన్ని అలా అనొచ్చు. అలా కాకుండా.. కథా పాతదై.. నడకా కూడా చెత్తగా ఉంటే.. దాన్ని ఏమనాలి? ‘తడిసిన చెత్త’ అనాలి. కంపు కొడుతుంది కదా... ఈ సినిమా కూడా అంతే. ‘బావుంది’ అని చెప్పడానికి ఒక్కటీ లేని సినిమా ఈ మధ్య కాలంలో ఈ సినిమానే అనొచ్చు. నత్త నడకన సాగే కథనం.. ఏమాత్రం ఆసక్తి లేని రొటీన్ సన్నివేశాలు.. వెరసి ‘యుద్ధం శరణం’. పోనీ నటీనటుల అభినయం అయినా బావుందా అంటే అదీ లేదు. ఇక్కడ వాళ్లనూ తప్పుపట్టలేం. ఎందుకంటే... పాత్రల్లో కొత్తదనం ఏడిస్తే.. అభినయం కూడా కొత్తగా ట్రై చేయొచ్చు. చేసిన పాత్రలనే మళ్లీ చేశారు. చూసిన ఎక్స్ ప్రెషన్లనే మళ్లీ జనం చూశారు... అంతే. పాపం... శ్రీకాంత్. నిజానికి మంచి విలన్ అనిపించుకోదగ్గ నటుడే. కానీ... ఈ సినిమా అతని ప్లాట్ ఫాం అవ్వడం బాధాకరం. చేయడానికి ఇందులో ఏమీ లేదు. బ్యాడ్ లక్. సాయి కొర్రపాటికి అభిరుచి గల నిర్మాతగా పేరుంది. మరి తనకు ఏం చెప్పి దర్శకుడు ఈ కథను ఒప్పించాడో అర్థం కావడంలేదు. ఏది ఏమైనా... రాంగ్ స్టెప్ అయితే పడింది. కరెన్సీకి కాళ్లొస్తే... ఇలాగే ఉంటుంది మరి.

ఇక సాంకేతికంగా పరమ నాసిరకం సినిమా ఇది. కెమెరా వర్క్ అస్సలు బాలేదు. ఏవేవో సౌండ్లు వినిపించాయ్. వాటిని మనం సంగీతం అనుకోవాలి. సినిమా పాడైపోయిందని దర్శకుడికి మధ్యలోనే తెలిసిపోయినట్లుంది. అందుకే.. నిర్మాతను ఇంకా ఇబ్బంది పెట్టలేక. కనీసం.. కలర్ గ్రేడింగ్ కూడా చేయకుండా వదిలేశారు. స్క్రీన్ మొత్తం ఏదో దుమ్ముపట్టినట్టు అనిపిస్తుంది. కనీసం అక్కినేని అభిమానులకు కూడా నచ్చే సినిమా కాదిది. అందులో డౌటే లేదు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

టోటల్ గా ‘యుద్ధం శరణం... చూస్తే మరణం’ అందుకే జాగ్రత్త పడండి

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here