English | Telugu
సినిమా పేరు: పైసా వసూల్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
Rating : 2.50
విడుదలయిన తేది : Sep 1, 2017
Facebook Twitter Google

తారాగణం:- బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కబీర్ బేడీ...
దర్శకత్వం:- పూరీ జగన్నాథ్
నిర్మాత:- వి.ఆనంద్ ప్రసాద్


చిన్న సినిమాల కథలంటే... పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అభిరుచి ఉండాలే కానీ... అద్భుతమైన కథలే పుడతాయ్. సృజన ఉండాలే కానీ.. ఎన్ని ప్రయోగాలైనా తయారవుతాయ్. నష్టం ఏం లేదు. కానీ... స్టార్ హీరో సినిమాకు కథ అంటే మాత్రం కచ్చితంగా హీరోగారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే.. అభిమానులకు ఆయనే సూపర్ మేన్, స్పైడర్ మేన్. హీ మాన్. 

కథ భూమ్మీద నడిచినా పర్లేదు. కేరక్టరైజేషన్ మాత్రం ఆకాశాన్నంటాలి. తెరపై కనిపిస్తున్నంతసేపూ అసామాన్యమైన పనులే చేయాలి. మామూలుగా.. బయట అందరిలా ప్రవర్తిస్తే... సహించలేరు.. భరించలేరు. 

‘ఒక్కడు కొట్టడమేంటి? పదిమంది పడటమేంటి? ఆ చంపడాలేంటి? ఆ నరుక్కోవడాలేంటి?... అని ప్రశ్నించడానికి కూడా లేదు. ఎందుకంటే... అలా తీస్తేనే ఫ్యాన్స్ చూస్తారు. సో... ఊర సినిమాలు విడుదలైనప్పుడు క్రిటిక్స్ అనేవారి దృక్కోణం కూడా ఫ్యాన్స్ కి తగ్గట్టే ఉండాలి. లాజిక్కులు పక్కన పెట్టి చూడాలి. ఈ రకం సినిమాల నుంచి జనాలు ఆశించేది కాస్తంత జోష్. ఇంకాస్త ఎమోషన్. అంతే. అవి ఉన్న సినిమాలు హిట్. లేని సినిమాలు ఫట్. ఈ శుక్రవారం ఓ ఊర సినిమా విడుదలైంది. దాని పేరు ‘పైసా వసూల్’. నందమూరి బాలకృష్ణ హీరో. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయ్. మరి ఆ అంచనాలను ఈ సినిమా నిజం చేసిందా? లేదా? అని తెలుసుకునే ముందు కథేంటో తెలుసుకుందాం. 

కథ:-
దేశంలో మాఫియా అరాచకాలు తారాస్థాయికి చేరడంతో.. పోలీసులు ఉక్కిబిక్కిరి అవుతుంటారు. వీళ్ల యాక్టివిటీస్ కి అడ్డుకట్ట వేయడానికి ఓ తేడాగాడు అవసరం అని భావించిన పోలీసులు... అలాంటి వాడికోసం వెతుకుతారు. అప్పుడు దొరుకుతాడు ‘తేడాసింగ్’. పేరుకు తగ్గట్టే తేడా. దిమాఖ్ థోడా. పోలీసుల మాట ప్రకారం మాఫియాతో చేతులు కలుపుతాడు. మరో వైపు ఓ అమ్మాయికి చేరువ అవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలావుంటే... అనుకోని విధంగా ఆ అమ్మాయి కుటుంబాన్ని మాఫియా టార్గెట్ చేస్తుంది. అసలు ఆ అమ్మాయ్ ఎవరు? ఈ తేడా సింగ్ ఎవరు? ఆ అమ్మాయ్ కుటుంబాన్ని తేడా సింగ్ రక్షించాడా? అనేది మిగిలిన కథ. ఎనాలసిస్ :

ఇంతకు ముందు వచ్చిన పూరీ సినిమాలు ఎలాగున్నాయో... యాజిటీజ్ గా ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే... ‘పోకిరి పార్ట్ 2’ అనొచ్చు. అందులో కూడా పోలీస్ అధికారి అయిన మహేశ్ మఫ్టీలో మాఫియా ఆగడాలను అరికడుతుంటాడు. ఇందులో కూడా ‘Raw’ఆపీసర్ అయిన బాలయ్య... మఫ్టీలో ఉంటూ మాఫియా కలుపు మొక్కల్ని ఏరేస్తాడు. 

సినిమాలో ఎక్కడ చూసినా... క్షవర సంస్కారం లేకుండా జుట్టు అదేపనిగా పెంచేసికోని.. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని.. తుపాకులు చేతపట్టుకొని కారుల్లో తిరిగే అరాచక గ్యాంగే కనిపిస్తుంటారు. పూరీ ప్రతి సినిమాల్లో వీళ్లుండాల్సిందే. ఈ మందను చూసి చూసి జనాలకు విసుగొస్తుంది కానీ... తీస్తున్న పూరీకి మాత్రం విసుగు రావడంలేదు. ప్రతి సినిమాలోనూ ఆ గ్యాంగ్ ఉండాల్సిందే. అసలు పూరీ దృష్టిలో యాక్షన్ సినిమా అంటే... ఇక మాఫియానేనా? అనే ప్రశ్న అందరికీ తలెత్తక మానదు. 

ఏది ఏమైనా.. తనకు తెలిసిన వంటనే మళ్లీ వండాడు పూరీ. అయితే... చాలా కాలం తర్వాత మళ్లీ రుచిగా వండాడు. ఈ సారి పూరీ వంటలో రుచి రావడానికి కారణం... బాలయ్య బ్రాండ్ మషాలా తోడవ్వడమే. తెరపై బాలయ్యను పూరీ చూపించిన తీరు వండరే అనాలి. ఇంతకు ముందు మనం చూడని బాలయ్యని ‘పైసా వసూల్’లో చూడొచ్చు. బాలయ్య లాంటి స్టార్ కి ‘తేడా సింగ్’ అని పేరు పెట్టడమే ఓ వైరైటీ. ఇక ఆ పాత్రతో పూరీ చేయించిన మ్యాజిక్కులు ఫ్యాన్స్ కి కావల్సినంత కిక్ ని ఇచ్చేస్తాయ్. తెరపై బాలయ్య యాడిట్యూడ్ చూసి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. బాలయ్య మార్క్ ఎమోషన్ ని కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు. వ్యక్తిగత సమస్యలు ఎన్ని ఎదురైనా... వాటన్నింటినీ తట్టుకొని మంచి ప్రొడక్ట్ అభిమానులకు అందించాడు పూరీ. 


ఈ సినిమా ఫస్ట్ హాఫ్... అప్పుడే అయిపోయిందా? అనిపించింది. సెకండాఫ్ కొంచెం లేగ్ అనిపిస్తుంది. అయితే... అదేం పెద్ద ఇబ్బంది కాదు. సెకండాఫ్ లో కూడా మాస్ కి కావల్సిన అంశాలన్నీ ఉన్నాయ్. పూరీ డైలాగులు ఈ సినిమా ప్రాణం. వాటిని బాలయ్య పలికిన తీరు ఈ సినిమాకు హైలైట్. పూరీ స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది. ప్రధాన విలన్ ని చంపేసిన విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ లో చెబుతాడు హీరో. అంతకు ముందు మనం చూడనిది. 

ఇక బాలయ్య... ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మనం చూసిన బాలయ్యేనా ఈ బాలయ్య అనిపించింది ఇందులో ఆయన నటన చూస్తే.. కామెడీ కూడా అదరగొట్టేశాడు. ఆయన చెబుతున్న ఒక్కొక్క డైలాగ్ కీ థియేటర్లో ఒకటే విజిల్స్. ఫ్యాన్స్ కు కన్నుల పండవ చేశాడనుకోండి. అయితే... డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేది. ఇందులో ప్రతి డైలాగునూ బాలయ్య పై స్థాయిలోనే చెప్పాడు. డైలాగుల్లో అప్ అండ్ డౌన్లు ఉండవ్. అది కాస్త ఇబ్బంది అనిపించింది. కీలకమైన కొన్ని కొన్ని డైలాగుల్ని మాత్రం బాలయ్య అద్భుతంగా పలికాడు. శ్రియ అందంగా కనిపించింది. చక్కగా చేసింది కూడా. ముస్కాన్ సేతు కూడా ఉన్నంతలో బాగానే చేసింది. మిగిలిన పాత్రలన్నీ పరిథి మేర రక్తికట్టించాయ్. 

పూరీ డైలాగులు ఈ సినిమాకు ఓ హైలైట్ అయితే... అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇంకో హైలైట్. పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా అదరహో అనిపించాడు అనూప్. ముఖేష్ జీ కెమెరా పనితనం బావుంది. భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ చక్కని సాహిత్యం అందించారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంది. 

టోటల్ గా పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఉంది. ‘పైసా వసూల్’గ్యారెంటీ. ఫ్యాన్స్ అయితే... పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తారు. నో డౌట్. ఓన్లీ ఫ్యాన్స్ అండ్. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ.. ఔటర్స్ నాట్ ఎలౌడ్

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here