English | Telugu
సినిమా పేరు: PSV గరుడ వేగ
బ్యానర్ : జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్
Rating : 2.75
విడుదలయిన తేది : Nov 3, 2017
Facebook Twitter Google

వరుస ఫెయిల్యూర్స్ తో గత రెండెళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రాజశేఖర్.. ఇప్పుడు ‘‘గరుడ వేగ’’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక గుంటూరు టాకీస్, చందమామ కథలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'గరుడ వేగ' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.


కథ :
 
ఓ సిన్సియర్ ఎన్ఐఏ ఆఫీసర్ చంద్రశేఖర్ ( డాక్టర్ రాజశేఖర్ ) ఫ్యామిలీని సైతం పట్టించుకోకుండా ఎప్పుడూ డ్యూటీ అంటూ తిరుగుతాడు. ఇక తన ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య పిల్లలతో గడుపుదామని నిర్ణయించుకుంటాడు. అలాంటి సమయంలో...ఓ కేసు ని దర్యాప్తు చేయాల్సి వస్తుంది చంద్రశేఖర్. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ హ్యాకర్ ద్వారా ‘‘గరుడ వేగ’’ మిషన్ గురించి తెలుసుకుంటాడు. దాని వెనక భారీ స్కాం ఉందని తన టీమ్ తో పాటు దాన్ని చేధించే ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నాడు.. స్కాం వెనక ఎవరెవరున్నారు అనేది మిగతా స్టోరి.

 ఎనాలసిస్ :

ఎవరెవరు ఎలా చేశారంటే..

ఈ సినిమాలో రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా బావున్నాడు. రాజశేఖర్ భార్య పాత్రలో నటించిన పూజా కుమార్ తాను సినిమాలో కనిపించేది తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక విలన్ గా నటించిన కిషోర్ పోస్టర్ కనిపించినంత భయంకరంగా అయితే లేడని చెప్పొచ్చు. పోస్టర్ చూసి ఎంతో ఊహించుకున్నారు కానీ.. పాత్ర ఊహించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో అదిత్ అరుణ్ నటించాడు. రాజశేఖర్‌తో అతడి కాంబినేషన్ బావుంది. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ ఓకే గా ఉంది. పోసాని ఉంటే సీన్లు ఏ రేంజిలో ఊహించుకుంటామో...అదే స్థాయిలో ఉన్నాయి. ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ వాల్యూస్..

గరుడ వేగ కంప్లీట్ టెక్నికల్ మూవీ. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కు టెక్నికల్ సపోర్ట్ గట్టిగా కావాలి. ఈ సినిమాకు చక్కగా కుదరింది. అంజి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. నిర్మాతలు పెట్టిన డబ్బు తెరపైన కనిపిస్తుంది. ఇక ఇలాంటి స్పై థ్రిల్లర్ ని హ్యాండిల్ చేయాలంటే డీటెయిలింగ్, గ్రిప్పింగ్ నరేషన్ అవసరం. ప్రవీణ్ సత్తారు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. రాజశేఖర్ ని హీరోగా చూపించడంలో సఫలం అయ్యాడు . అయితే ఫస్టాఫ్ ని బాగా నడిపించిన ప్రవీణ్ సత్తారు సెకండాఫ్ కు వచ్చేసరికి కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు . సెకండాఫ్ ని కూడా మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది . మొత్తానికి రాజశేఖర్ కు చాలాకాలం తర్వాత గరుడ వేగ రూపంలో విజయం వరించింది .


ప్లస్ పాయింట్స్


* ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్
* రాజశేఖర్ పెర్ఫార్మెన్స్
* ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

* సెకండ్ హాఫ్
* కామెడీ లేకపోవడం
* కొన్ని లాజిక్ లు మిస్తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

మొత్తానికి గరుడ వేగ సినిమా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గరుడ వేగ చూస్తే ఓ మంచి డిఫరెంట్ సినిమా చూసామన్న తృప్తి కలుగుతుంది. రాజశేఖర్ కెరీర్లో ఇదో మంచి యాక్షన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here