English | Telugu
సినిమా పేరు: ఫ‌ల‌క్‌నుమా దాస్‌
బ్యానర్ : వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్సర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్స్
Rating : 2.50
విడుదలయిన తేది : May 31, 2019
Facebook Twitter Google

నటీనటులు: విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, సలోని మిశ్రా, హర్షితా గౌర్ తదితరులు

పాటలు: సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ, ఫరూఖ్ భక్షి  

సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ 

సంగీతం: వివేక్ సాగర్ 

నిర్మాత: కరాటే రాజు 

కథనం, మాటలు, దర్శకత్వం: విశ్వక్ సేన్

విడుదల తేదీ: మే 31, 2019

 

తెలంగాణ యాస, భాషతో హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. మరి, సినిమా ఎలా ఉంది? మలయాళంలో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'అంగమలై డైరీస్' రీమేక్‌తో విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడా? లేదా? నటన, నిర్మాణం, దర్శకత్వం బాధ్యతలను భుజాన వేసుకున్న అతడు మూడు విభాగాల్లో విజయం సాధించాడా? లేదా? రివ్యూ చదివితే తెలుస్తుంది. 


కథ:

దాస్ (విశ్వక్ సేన్) ఫ‌ల‌క్‌నుమా కుర్రాడు. చిన్న వయసులో తండ్రి మరణిస్తాడు. ఫ‌ల‌క్‌నుమాలోని రౌడీ షీటర్ శంకరన్నను చూసి, పెద్దయ్యాక అతడిలా కావాలని అనుకుంటాడు. అవుతాడు కూడా! కొట్లాటలు అంటే చాలు... కాలు ముందుకు వేస్తాడు దాస్. తోపు తీరు లెక్క హ‌ల్‌చ‌ల్‌ చేస్తుంటాడు. ఒక రోజు గొడవల్లో దాస్ వేసిన బాంబు కారణంగా ఓ ప్రాణం పోతుంది.ఎనాలసిస్ :

అసలు, బాంబు వేయడానికి కారణం ఏంటి? అంతకు ముందు తను ఎంతగానో అభిమానించే శంకరన్నను చంపిన రవి, రాజుతో దాస్ మటన్ వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? రవి బావమరిదికి, దాస్‌కి గొడవ ఏంటి? హత్య కేసు నుంచి దాస్ బయటపడ్డాడా? లేదా? అనేది మిగతా సినిమా. 


ప్లస్ పాయింట్స్:

హైదరాబాద్ నేపథ్యం

వివేక్ సాగర్ సంగీతం

కొంతమంది నటన


మైనస్ పాయింట్స్:

కథ, దర్శకత్వం

సెకండాఫ్, క్లైమాక్స్

 

విశ్లేషణ:

కోనసీమ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ తేడాలు లేకుండా 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'లో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేదీ, ఆకర్షించేదీ హైదరాబాద్ నేపథ్యం! చార్మినార్, ఫ‌ల‌క్‌నుమా, టోలీచౌక్, మేకల మండి, జియాగూడ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ... ఇలా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. ప్రతి లొకేషన్ తెరపై బావుంది. సినిమాటోగ్రాఫర్‌గా విద్యాసాగర్‌ సహకారంతో హైదరాబాద్ అందాలను చూపించడంలో విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యారు. లొకేషన్లను పక్కన పెట్టి సినిమా విషయానికి వస్తే... ప్రేక్షకుల దృష్టి మరల్చకుండా కథను తెరకెక్కించడంలో దర్శకుడిగా విశ్వక్ సేన్ విఫలమయ్యాడు. లొకేషన్లు, హైదరాబాదీ యాస భాషలపై మీద ఎక్కువ దృష్టి పెట్టిన అతడు, సన్నివేశాల్లోని భావోద్వేగాలపై దృష్టి పెట్టలేదు. కథలోని ఆత్మను తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. ఎంతసేపూ ఆవేశాన్ని చూపించాలనుకున్నాడు తప్ప... మధ్య మధ్యలో వచ్చే ఇతర భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టలేదు. మలయాళ 'అంగమలై డైరీస్' కథలో యాభై శాతం మార్పులు చేశామని విశ్వక్ సేన్ చెప్పాడు. కథను హైదరాబాదీ నేపథ్యానికి మార్చడం, మాతృకలో హీరో చేసే బీఫ్ వ్యాపారాన్ని మటన్ వ్యాపారానికి మార్చడం మినహా అతడు పెద్దగా మార్పులు, చేర్పులు చేసిందేమీ లేదు. మెజార్టీ సినిమాను షాట్ టు షాట్ కాపీ చేశాడు. కాపీ చేస్తే సరిపోతుందా? భావోద్వేగాలను యధాతథంగా తెరకెక్కించాలి కదా! విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు సినిమాకు నిర్మాత. కాబట్టి, ప్రొడక్షన్ కూడా విశ్వక్ చూసుకున్నాడు. నిర్మాణంలో మాత్రం రాజీ పడలేదు. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు కావాల్సిన రఫ్ లుక్ తీసుకొచ్చింది. పాటల్లో 'అరెరే మనసా' చాలా బావుంది. మరో రెండు పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సూపర్బ్.  

 

నటీనటుల పనితీరు:

యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా కనిపించే సన్నివేశాల్లో విశ్వక్ సేన్ బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. చాలా రోజుల తరవాత సినిమా అంతా కనిపించే పాత్రలో ఉత్తేజ్ నటించారు. కనిపించినది కాసేపే అయినా... పోలీస్ పాత్రలో తరుణ్ భాస్కర్ చింపేశాడు. విశ్వక్ సేన్ స్నేహితులు, రవి, రాజు పాత్రల్లో నటించినవాళ్లు బాగా చేశారు. బాంబులు చుట్టే పాత్రలో నటించిన వ్యక్తి కామెడీ టైమింగ్, యాక్టింగ్ సూపర్. హీరోయిన్లు సలోని మిశ్రా, హర్షితా గౌర్ పాత్రలు తగ్గట్టు చేశారు. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కథగా, సినిమాగా ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వడంలో విశ్వక్ సేన్ తప్పటడుగులు వేశాడు. ఫస్టాఫ్ వరకూ పర్వాలేదనేలా తీశాడు. సెకండాఫ్ సినిమా గాడి తప్పింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 'జగడం'లో సుకుమార్ ఇటువంటి కథాంశాన్ని చూపించాడు. రౌడీ షీటర్‌ను చూసి చిన్న పిల్లాడు ఆకర్షితుడు కావడం, పెద్దయ్యాక రౌడీలా తయారవడం, హీరో క్యారెక్టరైజేషన్ వంటివి 'జగడం'ను గుర్తు చేస్తాయి. తప్పుల్ని సినిమాలో హైదరాబాదీ నేపథ్యాన్ని చక్కగా చూపించారు. ఉత్తేజ్, తరుణ్ భాస్కర్, కొంతమంది కొత్త నటీనటులు బాగా చేశారు. 

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here