English | Telugu
సినిమా పేరు: ఈ నగరానికి ఏమైంది
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్
Rating : 2.50
విడుదలయిన తేది : Jun 29, 2018
Facebook Twitter Google

నటీనటులు: నటీనటులు : విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి తదితరులు
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాత : డి.సురేష్ బాబు
సంగీతం : వివేక్ సాగర్
విడుదల తేదీ: జూన్‌ 29, 2018

తన మొదటి సినిమా పెళ్లి చూపులతో అద్భుతమైన హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. మరి తెలుగు దర్శకులందరూ ఎదుర్కొనే ద్వితీయ విఘ్నాన్ని దాటుకుని, అందులోనూ కొత్త నటీనటులను నమ్ముకుని ఈ సినిమాను విజయవంతంగా నడిపించాడా లేదా ‘ఈ నగరానికి ఏమైంది’లో చూడాల్సిందే!

కథ:

ఓ నలుగురు స్నేహితులు- కౌశిక్‌, కార్తీక్‌, ఉపేందర్‌, వివేక్‌ నాలుగు సంవత్సరాల తర్వాత కౌశిక్‌ పెళ్లిలో కలుసుకుంటారు. కౌశిక్‌ పెళ్లి తన బాస్‌ కూతురితోనే జరుగుతుంటుంది. అయితే ఈలోగా కౌశిక్‌ అయిదు లక్షలు విలువ చేసే తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ పోగొట్టుకుంటాడు. మళ్లీ ఆ రింగు కొనాలంటే డబ్బు అవసరం. డబ్బు కావాలంటే ఏం చేయాలో ఆలోచిస్తుండగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీసి డబ్బులు సంపాదించాలన్న ఐడియా తడుతుంది. ఎన్నో కష్టనష్టాల తర్వాత వాళ్లు ఆ షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తారు. షార్ట్‌ ఫిల్మ్‌ తీసిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయిందన్నదే మిగతా కథ...

పాజిటివ్స్‌:

1. కథ
2. ముఖ్య పాత్రల నటన
3. సంగీతం
4. దర్శకత్వం

నెగెటివ్స్:

1. అక్కడక్కడా బోర్‌ కొట్టించే సీన్స్‌
2. ఎమోషన్స్‌ పెద్దగా లేకపోవడం
3. క్లైమాక్స్‌
4. స్క్రీన్‌ ప్లేఎనాలసిస్ :

తరుణ్‌ భాస్కర్‌ మొదటి సినిమా పెళ్లి చూపులు భారీ విజయం సాధించడంతో ఈ సినిమా మీద విపరీతంగా ఆశలు పెరిగిపోయాయి. తనతో కలిసి పనిచేసేందుకు పెద్ద పెద్ద స్టార్లు ఎదురుచూసినా కూడా తరుణ్‌ తన రెండో సినిమాని కొత్త నటీనటులతోనే చేశాడు. నిజానికి ఈ కథకి కావల్సింది కూడా నూతన నటులే. ఈ తరం కుర్రకారు, సమాజం ముందు తమ గొప్పని నిరూపించేందుకు ఎలాంటి పాట్లు పడుతున్నారో... ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ సినిమా చూసేవాళ్లకి కొన్ని సన్నివేశాలలో తప్పకుండా తమ కాలేజి రోజులు గుర్తకు వస్తాయి. అక్కడక్కడా సినిమా కొంచెం నెమ్మదించినా, మంచి కథ కారణంగా ఆ లోటు తెలియదు. పైగా ఈ సినిమా చూస్తున్నంతసేపూ మన ముందు ఎవరో స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తుంది. సినిమా మొదటి భాగంలో కార్‌ యాక్సిడెంట్‌, బార్లో జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటే... రెండో భాగంలో స్టూడియోలో జరిగే కథ అలరిస్తుంది.

నటీనటులు:

నలుగురు స్నేహితులుగా నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను... తమ పాత్రలను బాగానే పోషించారు. అభినవ్‌ గోమఠం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాడు. అతను ఉన్న ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్వించింది. తన డైలాగ్‌ డెలివరీ, మేనరిజమ్స్ గిలిగింతలు పెడతాయి. అనీషా ఆంబ్రోస్ హుందాగా నటించింది. ఇక విశ్వక్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన సిమ్రన్ చౌదరి కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇతర నటులు కూడా బాగానే రాణించారు.

సాంకేతిక విలువలు:

తరుణ్‌ భాస్కర్‌ మంచి కామెడీ సన్నివేశాలనే రాశాడు. కానీ ఏ సినిమాలో అయినా ఉండితీరాల్సిన భావోద్వేగాలను మాత్రం మర్చిపోయాడు. ఇక దర్శకుడిగా కూడా తరుణ్ అద్భుతంగా రాణించాడు. పెళ్లి చూపులకి మంచి సంగీతాన్ని అందించిన వివేక్‌ సాగర్‌, ఈ సినిమాకు కూడా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. నికేత్‌ బొమ్మ కెమెరా పనితనం నిండుగా ఉంది. రెండో భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ఎడిటర్‌ డిలీట్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్‌ వాల్యూస్ కూడా బాగున్నాయి.

సినిమా ఎలా ఉందంటే!
కుర్రకారుకి ఈ సినమా బాగా నచ్చుతుంది. ఇందులో కథకి వాళ్లు కనెక్ట్‌ అవుతారు. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులనీ ఇది మెప్పిస్తుందని చెప్పలేం.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

యూత్‌ఫుల్‌ క్రేజీ ఎంటర్‌టైనర్‌

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here