English | Telugu
సినిమా పేరు: డీ-16
బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్
Rating : 2.75
విడుదలయిన తేది : Mar 10, 2017
Facebook Twitter Google

థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు రొటీన్‌కి భిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకొని, త‌మ క‌థ‌నంతో ప్రేక్ష‌కుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొన్ని సినిమాలు చూస్తుంటే... న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌పై భ‌రోసా పెరుగుతోంది. ఫ‌ర్లేదు... త‌ప్ప‌కుండా మంచి క‌థ‌లు, మంచి సినిమాలు రాబోతున్నాయి అనే సంకేతాలు అందుతున్నాయి. త‌మిళంలో ఈమ‌ధ్య ఓ సినిమా వ‌చ్చింది. పేరు... ధృవంగ‌ల్ ప‌తినారు. ఈసినిమాలో క‌థ‌ని న‌డిపిన విధానం చూసి అక్క‌డి విమ‌ర్శ‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో 16 పేరుతో డ‌బ్ చేశారు. మ‌రి అదే ఫీల్ తెలుగు ఆడియ‌న్స్‌కి క‌లిగిందా??  క‌థ‌నంలో ద‌ర్శ‌కుడు చేసిన మ్యాజిక్ ఏంటి??  తెలుసుకొందాం రండి.


* క‌థ‌

దీప‌క్ (రెహ‌మాన్‌) ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌.  ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు ఓ ప్ర‌మాదంలో త‌న కాలు పోగొట్టుకొంటాడు. ఓరోజు  త‌న స్నేహితుడు త‌న కొడుకు... 'అంకుల్ నాకు పోలీస్ ఆఫీస‌ర్ అవ్వాల‌ని వుంది' అంటూ వ‌స్తాడు. ఈ ఉద్యోగంలో ఎలాంటి సాధ‌క‌బాధ‌కాలు ఉంటాయో చెప్ప‌డానికి త‌న జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట‌మైన కేసు గురించి ఆ కుర్రాడికి చెప్ప‌డం ప్రారంభిస్తాడు దీప‌క్‌. స‌రిగ్గా ఐదేళ్ల క్రితం ఒక రోజు... వ‌రుస‌గా మూడు సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. ఓ అపార్ట్‌మెంట్‌లో అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతుంది. ఓ కుర్రాడు న‌డి రోడ్డుపై సూసైడ్ చేసుకొని చ‌నిపోతాడు. ఓ హిట్ అండ్ ర‌న్ కేసు కూడా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఈ మూడు కేసుల్నీ దీప‌క్ ఎలా డీల్ చేశాడు?  దీప‌క్ ఇన్వెస్టిగేష‌న్ చేసిన విధానం ఏమిటి?  హంత‌కుల్ని ప‌ట్టుకొన్నాడా, లేదా?  అనేదే ఈసినిమా క‌థ‌.

 ఎనాలసిస్ :

ఓ పోలీస్ ఆఫీస‌ర్ చేసే ఇన్వెస్టిగేష‌న్ ఈ సినిమా.  సాధార‌ణంగా ఇలాంటి జోన‌ర్‌లో ఓ కేసు, ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, లేదంటే కిడ్నాప్‌... ఇలా ఏదో ఓ విష‌యం చుట్టూనే న‌డుస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు మూడు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్ని తీసుకొని.. వాటి చుట్టూ న‌డిచే ఇన్వెస్టిగేష‌న్‌ని చూపించాడు. అదో కొత్త ర‌క‌మైన ఎత్తుగ‌డ‌. క‌మ‌ర్షియ‌ల్ అంశాలేం ఈ సినిమాలో క‌నిపించ‌వు. కేవ‌లం క‌థ మాత్ర‌మే న‌డుస్తుంటుంది. దాన్నీ అత్యంత స‌హ‌జంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. ఓ కేసులో ప‌రిశోధ‌న ఎలా మొద‌ల‌వుతుంది. `కీ`స్ ఎలా ప‌ట్టుకొంటారు?  హంత‌కుల్ని ఎలా గుర్తిస్తారు?   ఈ విష‌యాల్ని చాలా డిటైల్డ్‌గా చూపించారు ఇందులో. తొలి స‌గంలో అన్నీ చిక్కు ముడులే. ఇదెలా జ‌రిగింది??  ఎందుకు జ‌రిగింది??  ఎవ‌రు చేసుంటారు??  వీటిపైనే ఫోక‌స్ చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తీ స‌న్నివేశం చాలా నిదానంగా న‌డుస్తుంటుంది. పోలీస్ స్టేష‌న్ వాతావ‌ర‌ణం, పోలీస్ కానిస్టేబుళ్ల ప్ర‌వ‌ర్త‌న‌.. వీటిని చాలా స‌హ‌జంగా తెర‌కెక్కించాడు. ద్వితీయార్థంలో క‌థనంలో మ‌రింత వేగం వేస్తుంది. తొలి స‌గంలో వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అక్క‌డే దొరుకుతుంది. ప‌తాక సన్నివేశాలు మాత్రం షాక్ క‌లిగిస్తాయి. అప్ప‌టి వ‌ర‌కూ చూసిన సినిమా ఒక ఎత్తు... క్లైమాక్స్ మ‌రో ఎత్తు.  ఫ‌స్టాఫ్‌లో ద‌ర్శ‌కుడు చూపించిన ప్ర‌తీ డిటైలింగ్‌కీ.. క్లైమాక్స్ లో లింకు దొరుకుతుంది.  సినిమా  చూస్తున్నంత సేపూ...ఓ డిటెక్టీవ్ న‌వ‌ల చ‌దువుతున్న అనుభూతి క‌లుగుతుంది. సాధార‌ణంగా.. ఇలాంటి క‌థ‌లు ముగించ‌డం చాలా క‌ష్టం. అయితే ద‌ర్శ‌కుడు చాలా నేర్పుగా..  క‌థ‌కు న్యాయం జ‌రిగేలా ముగించాడు.  సినిమా కూడా గంట‌న్న‌ర‌లో ముగిసిపోతుంది. ఇలాంటి సినిమాల్ని వీలైనంత త్వ‌ర‌గా ముగించాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు.  

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

రెహ‌మాన్ పూర్తి స్థాయి ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో క‌నిపించ‌డం ఇదే తొలిసారి. ఆ పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. రెహ‌మాన్ బాడీ లాంగ్వేజ్‌, ఆ పాత్ర మాట్లాడే ప‌ద్ధ‌తి, బిహేవియ‌ర్‌... అన్నీ న‌చ్చుతాయి. డ‌బ్బింగ్ కూడా స‌రిగ్గా సెట్ అయ్యింది. మిగిలిన పాత్ర‌ధారులంతా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌వారే.  తెలుగుకి తెలిసిన న‌టీన‌టుల్ని తీసుకొని, ఈ సినిమా తెర‌కెక్కించి ఉంటే.... ఫ‌లితం ఇంకా బాగుణ్ణు.

* సాంకేతిక వ‌ర్గం

ఇది నూటికి నూరుశాతం ద‌ర్శ‌కుడి సినిమా. కొత్త ద‌ర్శ‌కుడైనా స‌రే.. ఓ క్లిష్ట‌మైన స‌బ్జెక్ట్‌ని చ‌క్క‌గా డీల్ చేశాడు. క‌థ‌ని ముగించిన విధానానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. కెమెరా త‌న ప‌ని తాను చేసుకొంటూ వెళ్లింది. నేప‌థ్య సంగీతం మ‌రో ప్ర‌ధాన బ‌లం. అయితే.. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ప్రేక్ష‌కుల‌కు కూడా స‌మాధానం దొర‌క‌దు. మ‌రీ ట్విస్టులు ఎక్కువ‌గా ఉండ‌డం, స్లో నేరేష‌న్ ఇబ్బంది క‌లిగిస్తాయి. అయితే థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా ఓ బెస్ట్ ఛాయిస్‌.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

* చివ‌రిగా:  16... థ్రిల్ 100%

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here