English | Telugu
సినిమా పేరు: c/o సూర్య
బ్యానర్ : లక్ష్మి నరసింహా ఎంటర్టైన్మెంట్స్
Rating : 1.25
విడుదలయిన తేది : Nov 10, 2017
Facebook Twitter Google

చేతిలో కథ లేదు. నిర్మాత అయితే రెడీగా ఉన్నాడు. ఇమిడియట్ గా సినిమా మొదలుపెట్టకపోతే నిర్మాత జారిపోతాడు. సో... ముందు ఏదో ఒక కథ తీసేయాలి. ఏలా? ఇక అక్కడ్నుంచి మెదడు క్రిమినల్ ఆలోచనలు చేయడం మొదలుపెడుతుంది. నాలుగు క్రమినిల్  ఐడియాలను పోగేసి.. ఏదో  ఒక ఇంగ్లిష్ సిినిమాలో నాలుగైదు సీన్లు కాపీ కొట్టేసి.. రెండు పాటలు, మూడు ఫైట్లు పెట్టేసి.. సినిమా చుట్టేసి... దానికి ఓ దిక్కుమాలిన టైటిల్ పెట్టేసి .. పారితోషికం రూపంలో ఇన్ని లక్షలు అకౌంట్ లో వేసేసి.. చివరాఖరున నిర్మాతను నట్టేట ముంచేసి.. సినిమాను జనాలపై వదిలేసి.. చేతులు దులిపేసుకొనే మహా మాయ దర్శకులు ఇండస్ట్రీలో  కోకొల్లలు. పేషన్ తో దర్శకులైన బాపతు కాదు వీళ్లంతా. వీళ్లకు కావాల్సింది డబ్బు. ఇలాంటి వాళ్లు తీసిన సినిమాలను చూడ్డం ఆరోగ్యానికి హానికరం. మందులు లేని రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు.. ఇంటి అడ్రస్ మరిచిపోవడం... తమలో తామే మాట్లాడుకోవడం.. పిచ్చి పిచ్చి ప్రవర్తించడం ఇలాంటి లక్షణాలు కూడా రోగిలో కనిపిస్తాయ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే... ఈ శుక్రవారం  ‘c/o సూర్య’ అనీ... ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమా గురించి చెప్పేముందు.. ఈ విషయాలను చెప్పాలనిపించింది అంతే. ‘నా పేరు శివ’ తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా  పొందిన సుశీందరన్ ‘c/o సూర్య’ కి దర్శకుడు. దాంతో తన గత చిత్రానుభూతిని మళ్లీ కలిగిస్తాడనే ఆశతో థియేటర్లకు వెళ్లారు ప్రేక్షకులు.  మరి వారి కలను దర్శకుడు నిజం చేశాడా? లేక కలవరానికి గురి చేశాడా? తెలుసుకునే ముందు.. కథలోకెళ్దాం.

కథ:-

హీరోది ఓ చిన్న కుటుంబం. అమ్మ, తను, చెల్లి. హీరోకి ఓ ఫ్రెండ్ కూడా ఉంటాడు. వాడూ, హీరో చెల్లి ప్రేమించుకుంటారు. సినిమా మధ్యలో ఈ విషయం హీరోకి తెలుస్తుంది. అయితే.. అదే సందర్భంలో తన ఫ్రెండూ, చెల్లి అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటారు. దాని నుంచి వారిద్దరినీ హీరో ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.

 ఎనాలసిస్ :

ఒక విచిత్రానుభూతిని కలిగించే సినిమా ఇది. తెరపై ఏదో జరుగుతుంటుంది. ఏం జరుగుతుందో మెదడుకు అర్థం కాదు. ఏం చూస్తున్నామో కళ్లకు అర్థం కాదు. ఎవరెవరో వస్తుంటారు. ఏదేదో చేస్తుంటారు. అంతా మాయ. నిజానికి ఏం చెప్పాలనుకున్నాడో దర్శకునికే క్లారిటీ లేదు. అందుకే ఏదో ఒకటి అనేసి ఊరుకున్నాడు. ఇటలెక్చ్యువల్ స్క్రీన్ ప్లే అంటే జనానికి అర్థం కాకుండా తీయడమా?  ఏ సినిమా అయినా.. పోనుపోనూ మెదడు వర్క్ మొదలుపెడుతుంది. కానీ.. ఈ సినిమా ప్రారంభం నుంచి మెదడ్ని మెలిపెట్టడం మొదలుపెట్టింది. ఒక వికృతమైన పాట వినిపిస్తుంటుంది.. టైటిల్స్ పడతాయ్. ఓపెన్ చేయడమే.. హాస్పటల్. హీరో తండ్రికి ఆపరేషన్. అది కాస్తా  ఫెయిల్ అయి ఆయన చనిపోతాడు. హీరో డాక్టర్లపై ‘మా నాన్నను మీరే చంపేశారు’ అని చొక్క పట్టుకొని ఏడుస్తూ ప్రశ్నిస్తుంటాడు. ఆ సీన్ చూడగానే... మనం ఏదో ఊహించుకుంటాం. . కానీ.. దర్శకుడు మన ఊహలకు అందలేదు. సంబంధం లేనిది ఏదో తీశాడు.

నేపథ్య సంగీతం, కెమెరా తప్ప.. ఈ సినిమాలో సాంకేతికంగా బావుంది  ఏదీ లేదంటే నమ్ముతారా? సందీప్ కిషన్ కూడా ఎప్పటిలాగే చేశాడు. హీరోయిన్ మెహ్రిన్ సినిమాను అక్కడక్కడ అలంకరించింది. ఇక ‘శంకరాభరణం’ తులసి వికృతాభినయంతో ప్రేక్షకుల్ని భయకంపితుల్ని చేసింది. ఇక నటన పరంగా చెప్పుకోదగ్గ వాళ్లు ఎవరూ లేరు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

చివరిగా చెప్పేదేంటంటే.. ఈ సినిమా చూశాక... గతంలో వచ్చిన తెలుగు ఫ్లాప్ సినిమాలపై మనకు గౌరవం పెరుగుతుంది. ఆ సినిమాలను తీసిన దర్శకులు మనకు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తారు.

 

  
  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here