మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని... ఆయన తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్, కొత్త పెళ్లికొడుకు నితిన్, యువ హీరో విష్వక్సేన్ వరకూ ఈ రోజు అందరి ఇళ్లు రాఖీ పౌర్ణమి పండగ కాంతులతో ధగధగ మెరిసిపోయాయి. మాగ్జిమమ్ సినిమా సెలబ్రిటీలు అందరూ రాఖీ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, స్టార్ కిడ్స్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
మహేష్ పిల్లలు ముద్దొస్తున్నారు!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇంట్లో ప్రతి పండగ స్పెషలే. అందుకు కారణం ఆయన పిల్లలే. పండక్కి భలే ముస్తాబు అవుతారు. రాఖీ అంటే తోబుట్టువుల పండగ. తెల్లటి దుస్తుల్లో మహేష్‌బాబు కుమారుడు గౌతమ్, చక్కటి చుడీదార్లో సితార మెరిసిపోయారు. వాళ్ళిద్దర్నీ చూస్తే భలే ముద్దొస్తున్నారు.
అల్లు కిడ్స్... ఎట్రాక్షన్ ఎగైన్!
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టయిల్స్‌తో ఎలా ఎట్రాక్షన్‌గా నిలుస్తారో... ఆయన పిల్లలు కూడా అలాగే ఎట్రాక్షన్‌గా నిలిచారు. అన్నయ్య అయాన్‌కి చెల్లెలు అర్హ బొట్టు పెడుతున్న ఫొటో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
మంచు మనవడు, మనవరాళ్ళు!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో నలుగురు మహాలక్ష్మిలు ఉన్నారు. మంచు విష్ణుకి ముగ్గురు కుమార్తెలు, లక్ష్మీ మంచుకి ఓ కుమార్తె. మంచు మూడో తరంలో ఇప్పటివరకూ అబ్బాయి ఒక్కడే. విష్ణు కుమారుడు అవ్రామ్భక్త. అతడికి సిస్టర్స్ రాఖీలు కట్టారు. బాలీవుడ్‌లోనూ పలువురు స్టార్ కిడ్స్ ఈ రోజు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.