భారతీయ సంప్రదాయంలో రాఖీ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. సోదర సోదరీమణుల అనుబంధాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే వేడుక రక్షా బంధన్. సినిమా తారలు అందరూ ఈ రోజు రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోలకు సిస్టర్స్ రాఖీలు కట్టారు. హీరోయిన్లు ఏమో తమ బ్రదర్స్‌కి రాఖీలు కట్టారు. మరి, బ్రదర్స్ లేని వాళ్లు? సిస్టర్స్‌కి కట్టారు. మీరు చదివింది నిజమే! ఆశ్చర్యంగా అనిపించినా... అక్షరాల నిజం.
తాప్సీకి సొంత బ్రదర్ లేరు. చెల్లెలు మాత్రమే ఉంది. ఆమె పేరు షగున్ పన్ను. ఈ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే, మరో స్టార్ హీరోయిన్ కృతీ సనన్కీ సొంత బ్రదర్ లేరు. ఆమెకూ ఓ సిస్టర్ ఉన్నారు. పేరు నుపూర్ సనన్. ఆ అక్కాచెల్లెళ్ళు సైతం రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. రాఖీ పౌర్ణమి రోజున పన్ను సిస్టర్స్, సనన్ సిస్టర్స్ సినిమా తారలు అందరిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. అదీ సంగతి!