Home » Movie Reviews » ఆకాశమే నీ హద్దురా



Facebook Twitter Google


నటీనటులు: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్   తదితరులు
సినిమాటోగ్రఫీ: నికెత్‌ బొమ్మిరెడ్డి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాతలు:  సూర్య, గునీత్ మోంగా 
విడుదల తేదీ: 12 అక్టోబర్ 2020 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)

'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి ఫిక్షనల్ బయోపిక్ సూర్య చేశారు. ఇప్పుడు 'ఆకాశమే నీ హద్దురా' అంటూ ప్రజలు మెచ్చిన, విమాన ప్రయాణాన్ని ప్రజలకు దగ్గర చేసిన 'ఎయిర్ డెక్కన్' వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ గా సినిమా చేశారు. ప్రతి సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకునే సూర్య, ఈ సినిమాలో పాత్ర కోసం మేకోవర్ అయ్యారు. ఉన్నత శిఖరాలకు ఎదిగిన సామాన్యుడి కథలు ఎప్పుడూ ప్రజల్లో ఆసక్తి కలిగిస్తాయి. అయితే, కథ అందరికీ తెలియడం కాస్త మైనస్ అని చెప్పుకోవాలి. కానీ, కథలో మలుపులు తెలియవు కనుక ఆసక్తి కలిగిస్తాయి. మరి, కెప్టెన్ గోపినాథ్ జీవితకథలో మలుపులు ఎలా ఉన్నాయి? 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? 'ఎన్.జి.కె', 'బందోబస్తు' పరాజయాలతో ఉన్న సూర్యకు ఈ సినిమా విజయాన్ని అందించిందా? రివ్యూ చదివి తెలుసుకోండి. 

కథ: ఒక మామూలు స్కూల్ టీచర్ కుమారుడు, పైలెట్ చంద్రమహేశ్ అలియాస్ మహా (సూర్య) ఎయిర్ లైన్స్ సంస్థను ఎలా స్థాపించాడు? అన్నది చిత్రకథ. అయితే... ' ఎయిర్ డెక్కన్' స్థాపించడానికి పైలెట్ ఎన్ని కష్టాలు పడ్డాడు? విమానాశ్రయంలో చంద్రమహేశ్ స్థంస్థ విమానం దిగడానికి ఏవియేషన్ అధికారులు ఎందుకు ఒప్పుకోలేదు? అతడి ప్రయాణంలో శ్రీమతి సుందరి (అపర్ణా బాలమురళి), పరేష్ గోస్వామి (పరేష్ రావెల్), భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) పాత్రలేమిటి? అన్నది ఆసక్తికరం. 



ఎనాలసిస్ :

'ఆకాశమే నీ హద్దురా'లో కథేంటో ప్రేక్షకులకు తెలుసు. క్లైమాక్స్ ఎలా ఉంటుందో కూడా ప్రేక్షకులకు తెలుసు. అటువంటి అప్పుడు తర్వాతి సన్నివేశంలో ఏం జరుగుతుందోనని ఆసక్తి కలిగించేలా కథనం ఉండాలి. అటువంటి కథనం రాసుకోవడం సుధా కొంగర సక్సెస్ అయ్యారు. స్ట్రయిట్ గా కథను చెప్పకుండా విమానం ల్యాండింగ్ కాకుండా ఏవియేషన్ అధికారులు అడ్డుకోవడం దగ్గర సినిమా ప్రారంభించి సస్పెన్స్ క్రియేట్ చేశారు. అలాగే, కథకు కమర్షియల్ హంగులు జోడించారు. అయితే... కొన్ని సీన్లలో మరీ సినిమాటిక్ గా వెళ్లారు. తెలుగు ప్రేక్షకులకు తమిళ నేటివిటీ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే, నిడివి కూడా ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటె బాగుండేది. 

ఎయిర్ డెక్కన్ స్థాపించడానికి గోపినాథ్ పడిన కష్టాలు మాత్రమే సినిమాలో చెప్పలేదు. సుఖదుఃఖాల్లో అతడికి తోడూ నీడగా నిలిచిన భార్య గురించీ చెప్పారు. ఈ సినిమాలో భార్యాభర్తల నేపథ్యంలో వచ్చే సన్నివేశాల ద్వారా వైవాహిక బంధంలో ఎలా ఉండాలని ప్రేక్షకులకు పరోక్ష సందేశం ఇచ్చారు. సూర్య, అపర్ణ కెమిస్ట్రీ వల్ల ఫ్యామిలీ సన్నివేశాలకు మరింత అందం వచ్చింది. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ సీన్లు ఎక్కువ ఉంటే... సెకండాఫ్ అంతా ఏవియేషన్ జర్నీ చూపించారు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాలు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌:
సూర్య, అతడి నటన
మిగతా నటీనటులు
కథనం, దర్శకత్వం
పాటలు, నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌:
సినిమా నిడివి 
తమిళ నేపథ్యం 
సినిమాటిక్ సీన్లు 

నటీనటుల పనితీరు: నటుడిగా కెప్టెన్ గోపినాథ్ పాత్రలో సూర్య ఒదిగిపోయారు. యాక్టింగ్ అదరగొట్టాడు. తండ్రి మరణించినప్పుడు టికెట్ కొనడానికి డబ్బులు లేని సన్నివేశంలో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి భార్యగా అపర్ణ బాలమురళి సహజంగా నటించారు. మోహన్ బాబు నటన వల్ల పాత్ర పండింది. డైలాగుల్లో తానెంత మేటి అనేది మరోసారి నిరూపించారు. పాత్రకు తగ్గట్టు నటించారు. విలనిజం చూపించడానికి కండలు తిరిగిన దేహం అవసరం లేదని, హావభావాలతో చూపించవచ్చు అని పరేష్ రావెల్ నిరూపించారు. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఇప్పటివరకూ ఓటీటీల్లో విడుదలైన సినిమాలన్నీ సోసోగా ఉన్నవే. వాటితో పోలిస్తే 'ఆకాశమే నీ హద్దురా' చాలా బాగుంది. తమిళ నేటివిటీ, నిడివి కొంచెం పంటికింద రాయిలా మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినా... సూర్య నటన, సంగీతం, సుధా కొంగర దర్శకత్వం సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఎమోషన్స్, మెసేజ్ అందించాయి.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.