యువ హీరో నితిన్ నటిస్తున్న సినిమాలలో 'రంగ్ దే' ఒక్కటి. కీర్తి సురేశ్ హీరోయిన్. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను' సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ చేశారు. హిందీ కథానాయిక కరీనా కపూర్ నటిగా పేరు, విజయం దక్కించుకున్న 'జబ్ వుయ్ మెట్' ఇన్స్పిరేషన్ తో ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్ గుసగుస. అది ఎంతవరకు నిజమో విడుదలైతే గానీ తెలియదు.
తెలుగులో 'జబ్ వుయ్ మెట్' సినిమాను రీమేక్ చేయలేదు. కాకపోతే... తరుణ్, జెనీలియా జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'శశిరేఖ పరిణయం' సినిమాలో 'జబ్ వుయ్ మెట్' ఛాయలు కనిపిస్తాయి. హీరో హీరోయిన్ కలిసి ట్రావెల్ చేయడం, అందులో ఇద్దరి మధ్య కోపతాపాలు వంటివి హిందీ సినిమాను గుర్తు చేస్తాయి. అయితే సన్నివేశాల్లో ఎక్కడా పోలికలు ఉండవు. జస్ట్ అవుట్ లైన్ మాత్రమే సేమ్. వెంకీ అట్లూరి కూడా అదే విధంగా తనదైన శైలిలో 'రంగ్ దే' ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఏమో!?