వెంకటేశ్ శకం ముగిసినట్లేనా..?
on Feb 22, 2017
విక్టరి వెంకటేశ్..దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి..మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమాను భుజాలపై మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 50 ప్లస్‌లోనూ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. కాని ఇదంతా నాణేనికి ఒకవైపే. చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్లు మాత్రం రావడం లేదు..ఒకప్పుడు వెంకి సినిమా తీస్తున్నాడంటే అది సూపర్‌హిట్ కిందే లెక్క. తెలుగు హీరోల్లో సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్న హీరో ఎవరంటే ముందుగా చెప్పుకునేది వెంకటేశ్ పేరే.
అలాంటిది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం తర్వాత చేసిన సినిమాలు వెంకీని నిరాశపరిచాయి. తన తోటి హీరోలు బాలయ్య, నాగార్జునలు వరుస హిట్లతో పాటు కలెక్షన్లు కుమ్మెస్తున్నారు. కాని వెంకీ మాత్రం పాతిక కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు మినిమమ్ బిజినెస్ కూడా చేయట్లేదు..దీంతో వెంకీతో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఎనౌన్స్ చేసిన రెండు సినిమాలు రద్దు కావడమే ఇందుకు ఎగ్జాంపుల్..తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి దర్శక నిర్మాతలు లేక పడిగాపులు కాస్తున్నాడు..ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే వెంకీ కెరీర్ ఇక ముగిసినట్లేనా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.