వడ్డే నవీన్ విలన్ గా..?
on Feb 23, 2015
మాజీ తెలుగు హీరోలకు విలన్ పాత్రలపై మనసు మళ్లుతోంది. ఇప్పటికే సుమన్, జగపతిబాబు వంటివారు విలన్ పాత్రల్లో రాణిస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో మరో్ హీరో చేరుతున్నారు. అయితే, అమాయకమైన మొఖంతో కనిపించే ఆ హీరోను విలన్ గా ఊహించడానికే ఆశ్చర్యమేస్తోంది. పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా ఊపిరి వంటి చిత్రాలల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ త్వరలో విలన్ గా కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నవీన్ విలను పాత్ర పోషించనున్నట్లు సమాచారం. శ్రీమతి కళ్యాణం చిత్రం తర్వాత వడ్డే నవీన్ ఏ చిత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు విలన్ గా రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.