నరసింహారెడ్డి దొంగా?.. దోపిడీదారా? ఎంతమాట..! ఎంతమాట..!
on Feb 1, 2018
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.... ఈ పేరు ఓ చరిత్ర. తొలి స్వాతంత్ర్య సమరయోధునిగా చరిత్రకెక్కిన మహావ్యక్తి ఉయ్యాలవాడ. కానీ ఇప్పుడు ఉయ్యాలవాడ కథే తప్పుల తడక అంటున్నాడో వ్యక్తి. అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కాదని మీడియా ముందుకొచ్చి మరీ వాదిస్తున్నాడాయన. అతని పేరు నెక్కంటి శ్రీనివాసరావు. అతని కథనం ప్రకారం...
ఉయ్యాలవాడ ఓ దోపిడీదారుడు.. దొంగ. తనకు తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 11 రూపాయలనూ బ్రిటీష్ వారు చెల్లించకపోవడంతో.... దోపీడిలకు తెగబడ్డాడు. దారి దోపిడీలు చేస్తూ జీవితం సాగించేవాడు. ఈ క్రమంలో ఎందరో అమాయకుల్ని చంపాడు. అందుకే అతడ్ని బ్రిటీష్ వారు ఉరి తీశారు. ఇది నెక్కంటి శ్రీనివాసరావు వాదన.
అయితే... ఉయ్యాలవాడపై రాసిన ఏ పుస్తకంలోనూ ఇలాంటి ఆరోపణలు లేకపోవడం గమనార్హం. క్షుణ్ణంగా కొన్ని పుస్తకాల్లో మాత్రం ఇద్దరు భార్యలున్న ఉయ్యాలవాడ... మరో ఆవిడను కూడా ప్రేమించినట్టు, చేరదీసినట్టు కథనాలున్నాయ్. అంతేతప్ప దొంగ అని మాత్రం ఎక్కడా లేదు.
అంతేకాదు.... బ్రిటీషర్ తల నరికిన తొలి భారతీయుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆయన చేసిన పోరాటంపై రాయలసీమలో కథలున్నాయ్. ఇప్పటికీ వాటిని బుర్ర కథల రూపంలో చెప్పుకుంటూనే ఉంటారు. కాబట్టి ఉయ్యాలవాడపై నెక్కంటి శ్రీనివాసరావు చేస్తోంది వ్యర్థవాదన అని తేల్చేస్తున్నారు చాలామంది.
ఇదిలావుంటే... ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పగడ్బందీగా జరుగుతోంది. సాయిమాధవ్ బుర్రా రాస్తున్న డైలాగులు రేపు డైనమేట్లలా పేలనున్నాయని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. ‘సైరా’ సంక్రాంతికి రావచ్చనేది యూనిట్ వర్గాల భోగట్ట.