English | Telugu
Home  » Gossips

మళ్ళీ ఉపాసనని టార్గెట్ చేశారు..?

on Dec 6, 2017

పుకారు రాయుళ్లకి.. పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్లకి ఎప్పుడూ ఏదో ఒక వార్త కావాలి. అనుకున్న సమయానికి అదిగానీ దొరక్కపోతే వాళ్ల బుర్ర హీటెక్కిపోతుంది. ఏం చేయాలో అర్థంకాక ఆ సమయానికి ఏది తోస్తే దాని గురించి రాసేసి జనం మీదకు వదులుతారు. ఇలాంటి వారికి ఒక వ్యక్తే ప్రతీసారి దొరకితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రకంగా రెండుసార్లు పబ్లిసిటీ కేటుగాళ్లకు దొరికారు మెగాస్టార్ కోడలు ఉపాసన. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లై ఇన్నేళ్లయినా తమకు బుల్లి హీరోని ఇవ్వకపోవడంపై మెగా అభిమానులు కాస్త నిరాశలోనే ఉన్నారు.

ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న పుకారు రాయుళ్లు ఉపాసన గర్భవతంటూ జోరుగా ప్రచారం చేశారు. ఇది నిజమని నమ్మిన మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా ఉపాసన ఖండించడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. రీసెంట్‌గా ఒకటి, రెండు రోజుల నుంచి మళ్లీ ఉపాసన ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ గతంలోలా దీనిని నమ్మేందుకు మెగా అభిమానులు సిద్ధంగా లేరు. ఏదైనా అఫీషియల్‌గా న్యూస్ వస్తేనే కానీ రీయాక్ట్ అవ్వలేమని వారు తెగేసి చెబుతున్నారట. దీనిపై చరణ్ దంపతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here