English | Telugu
Home  » Gossips

బన్నీకి ఏమైంది...?

on Mar 17, 2017

సినీ రంగానికి విశేష సేవలందించిన వారికి ప్రతియేటా అల్లు రామలింగయ్య గారి పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాది దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంపికయ్యారు. 2016వ సంవత్సరానికి గానూ ఆయన్ను ఈ అవార్డు వరించింది. సినీరంగానికి చెందిన అతిరథ మహరథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందరి కళ్లు ఒకరి మీదే పడ్డాయి..ఆయన ఎవరో కాదు అల్లు రామలింగయ్య గారి మనవడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన బన్నీని చూసిన అక్కడి వారందరూ అవాక్కయ్యారు. కారణం ఆయన ముక్కుకి, నోటికి అడ్డంగా మాస్క్‌ని పెట్టుకొచ్చారు. అలాగే ఎప్పుడూ ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా చలాకీగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారందరిని ఉత్సాహపరిచే బన్నీ గ్యాలరీలో దిగాలుగా కూర్చున్నాడట. దీంతో బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ స్టైలిష్ స్టార్‌కి ఏమైందా అని చెవులు కొరుక్కుంటున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here