సమంతకు ఐదుకోట్ల గెస్ట్ హౌస్ ఇచ్చారట..
on Jul 26, 2014
టాప్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ ఎంతై వుంటుంది... ఒక కోటి, రెండు కోట్లు... అంత యిస్తే ఎందుకు కాదనం అని ఈమధ్య కాజల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు కూడా 5, 6 కోట్లకు మించి రెమ్యునరేషన్ లేదు. మరి మన టాలీవుడ్ లో హీరోయిన్ కి కోటి రూపాయలు అంటే అదో పెద్దవార్త అవుతుంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న కథనాలను బట్టి చూస్తే సమంత రెమ్యునరేషన్ ఐదు కోట్లు అని రూడీ చేసుకోవాలి. డెబ్యూ హీరోతో సమంత కలిసి నటించడానికి భారీ మొత్తం వసూలు చేసి వుంటుందని మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నారు. అల్లుడు శీను సినిమాలో నటించడానికి సమంత ఒక్క రూపాయి కూడా క్యాష్ తీసుకోలేదట. కేవలం ఐదుకోట్ల విలువ చేసే ఒక గెస్ట్ హౌజ్‌ని మాత్రం దక్కించుకుందనే టాకు టాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటోంది. ఏమైనా డెబ్యూ హీరో లాంచింగ్ కి కొత్త తరహా వసూళ్లు సమంత స్టార్ట్ చేసిన కొత్త ట్రెండ్ అనుకోవాలేమో మరి..