మెగా హీరో సినిమా..? అమ్మో అంటోన్న బయ్యర్లు
on Feb 5, 2018
సాధారణంగా మెగా హీరోల సినిమాలంటే టీజర్ బయటికి వచ్చేనాటికే మినిమమ్ బిజినెస్ అయిపోతుందని ఇండస్ట్రీలో టాక్. ఒకవేళ అప్పటికి టెక్నికల్‌గా ఆటంకాలు ఎదురైతే.. ఆడియో లాంఛ్ నాటికి బిజినెస్ కంప్లీటైపోతుంది. అయితే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్‌కు మాత్రం చాలా ఏరియాల్లో.. అసలు బిజినెస్ అవ్వలేదంటూ ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. సాయి రీసెంట్ ఫామ్ కలవరపరుస్తోంది.. విన్నర్, జవాన్ చిత్రాలు డిజాస్టర్లుగా మిగలడంతో ఇంటిలిజెంట్ను కొనడానికి ఎవ్వరూ ధైర్యం చేయడం లేదట.
దానికి తోడు నిర్మాత సి.కళ్యాణ్ మెగా హీరోలకు పట్టున్న కొన్ని ఏరియాల్లో రేట్లు విపరీతంగా పెంచేశాడు. ఒకవేళ ప్రొడ్యూసర్ చెప్పినంత రేటుకి కొన్నా.. అది తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు.. ఇది కూడా బయ్యర్ల భయానికి కారణం. ఇక నాట్ బట్ నాట్ ది లీస్ట్.. డైరెక్టర్ వివి. వినాయక్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెం. 150 కలెక్షన్ల పంట పండించినప్పటికీ.. అందులో వినాయక్ పనితనం ఏమీ లేదని.. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. నెట్టుకు రావడానికి కారణం చిరంజీవేనన్నది ఓపెన్ టాక్. మరి ఇప్పుడు ఇంటిలిజెంట్ను ఏ రకంగా డీల్ చేశాడో తెలియక బయ్యర్లు.. వెనకడుగు వేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.