ఆ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ 250 కోట్లు?
on Sep 17, 2020
సాలిడ్ సినిమా తీస్తే రెండు మూడు వందల కోట్ల రూపాయల తెలుగులో రావడం చాలా సులభమని 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలు నిరూపించాయి. ఉత్తరాది ప్రేక్షకులు సైతం దక్షిణాది సినిమాలను చూస్తారు అని చాటి చెప్పాయి. అందుకని, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందట. ఇంటర్నేషనల్ లెవెల్ లో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు తారక్. అది పాన్ ఇండియా ఫిలిం. మరో వైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న 'కేజిఎఫ్ 2' కూడా పాన్ ఇండియా ఫిలిం. ఆ రెండు సినిమాలతో తర్వాత ఇద్దరి మార్కెట్ మరింత పెరుగుతుందనీ, 250 కోట్ల రూపాయల వసూళ్లు రావడం పెద్ద కష్టమేమి కాదని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోందట. ఆల్రెడీ స్టోరీలైన్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తారక్ పాత్రను అదిరిపోయేలా డిజైన్ చేశారట.