ENGLISH | TELUGU  
Home  » Gossips

మెగాస్టార్..పవర్ స్టార్.. ఎవరు గొప్ప?

on Jan 19, 2018

‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా... గుండు దిగిందా లేదా.. అనేది ముఖ్యం‘ అనే  డైలాగ్ పవర్ స్టార్ కి సరిగ్గా సరిపోయేది. ఏ హీరో ఎన్ని  రికార్డులైనా కొట్టనీ... కేవలం ఓపెనింగ్ తో రికార్డులన్నింటినీ మట్టి కరిపించేసేవాడు. ఆయన కంటే  సీనియర్ స్టార్లు సైతం.. ఆయన పవర్ దెబ్బకి వెనక్కెళ్లిపోయారు. అయితే... పవర్ స్టార్ ఆటలు ప్రతి చోటా సాగాయ్ కానీ.. ఒక్క చోట మాత్రం సాగలేదు. అదెక్కడ? అనేగా మీ ప్రశ్న? అయితే... వివరాల్లోకెళ్దాం..

ఎప్పుడో ‘శంకర్ దాదా జిందాబాద్’  తర్వాత ఇన్నేళ్లకు మెగాస్టార్  ‘ఖైదీ నంబర్ 150‘ చేశారు. మెగాస్టార్ హీరోగా ఉన్నంతవరకూ ఆయన దరిదాపులకు కూడా ఎవరూ రాలేకపోయారన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడైతే..ఆయన పాలిటిక్స్ అని వెళ్లిపోయారో.. అక్కడ్నుంచి ఆయన వదిలి వెళ్లిన ‘నంబర్ వన్’ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. క్లారిటీగా.. క్లియర్ గా ‘ఈయనే నంబర్ వన్’ అని చెప్పగలిగే స్టార్  ఇప్పటివరకూ ఒక్కరూ లేరు. 

వసూళ్ల పరంగా ఆ స్థానాన్ని పవర్ స్టార్ కైవసం చేసుకున్నాడనే అందరూ భావించారు. ‘బాహుబలి’ సినిమాలను పక్కన పెడితే... హీరో ఓరియెంటెడ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ‘అత్తారింటికి దారేది’. తొలివారం 40 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి.. 2017 సంక్రాంతి దాకా రికార్డుగా నిలిచిందా సినిమా. అయితే... 2017లో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. అంతే.. రికార్డులన్నీ మళ్లీ బద్దలు బద్దలైపోయాయ్. ‘ఖైదీ నంబర్ 150‘ తొలివారం ఏకంగా 77 కోట్ల షేర్ రాబట్టి... బాక్సాఫీస్ నివ్వెర పోయేలా చేసింది. దటీజ్ మెగాస్టార్. ఇప్పుడు తాను వదిలెళ్లిన నంబర్ వన్ ఛైర్ పై మళ్లీ ఆయనే కూర్చున్నట్టయ్యింది. 

సరే... ‘ఏదో రాక రాక వచ్చాడు.. అందుకే అలా జనాలు ఇరగబడి చూశారు’ అనుకుందాం. మరి వెంటనే... పవర్ స్టార్ సినిమాలు ఓపెనింగ్ పరంగా అయినా.. మెగా రికార్డును తుడిచేయాలి కదా. ‘ఖైదీ నంబర్ 150‘ తర్వాత పవర్ స్టార్ వి రెండు సినిమాలొచ్చాయ్. అవే... కాటమరాయుడు, అజ్ఙాతవాసి. రెండూ డిజాస్టర్లు. ఓపెనింగుల పరంగా కూడా దారుణం. వేల కొలదీ థియేటర్లలో విడుదలైన ‘అజ్ఙాతవాసి’ సైతం... 50 కోట్ల వసూళ్ల దగ్గర చతికిలబడిపోయింది. దీన్ని బట్టి... అర్థమైందేంటి? ‘గుండు దిగడం కాదు ముఖ్యం అది సరైన చోట దిగిందా లేదా అనేది ముఖ్యం’..  అలా దిగాలంటే... అనుభవం ఉండాలి. ఏమంటారు? 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.