English | Telugu
Home  » Gossips

బాబాయ్, అబ్బాయ్ కాంబినేషన్ షురూ!

on Aug 13, 2017

కొంతమంది హీరోలకు ఇమేజ్ తో పనుండదు. ఏ పాత్రయినా చేసేస్తారు. ఎంతటి ప్రయోగానికైనా వెనుకాడరు. స్టార్ గా కంటే నటునిగా ఎదగడానికే ఇష్టపడతారు. కానీ... అనుకోకుండా స్టార్ అయిపోతారు. ఇలాంటి హీరోలు దేశ వ్యాప్తంగా వేళ్లపై లెక్కపెట్టుకునేంత మంది మాత్రమే ఉంటారు. వారిలో వెంకటేశ్ ఒకడు. పాత్ర బాగుంటే చాలు హీరోయిజంతో పనిలేదు. ఎలాంటి పాత్రనైనా చేసేస్తాడాయన. వెంకీ సినిమాలను పరిశీలిస్తే అది ఎంత నిజమో మీకే అర్థమవుతుంది.

ఇది వరకూ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసిన వెంకీ... ఇప్పుడు సంఖ్యను గణనీయంగా తగ్గించేశాడు. ‘గురు’ తర్వాత ఇప్పటివరకూ ఆయన నటించిన ఒక్క సినిమా కూడా సెట్స్ కి వెళ్లలేదు. దానికి కారణం... కథల్లేకపోవడమే. రొటీన్ కథలనేమో ఆయన ఇష్టపడడు. దాంతో అనుకోకుండా వచ్చేసిన గ్యాప్ ఇది. అయితే...  ఇప్పుడు వెంకీ మళ్లీ స్పీడ్ పెంచాడు. అన్ని పనులూ  పక్కనపెట్టి కథలు వినే పనిలో పడ్డాడు.  ఎట్టకేలకకు ఓ కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సురేశ్ ప్రొడక్షన్ పతాకంపైనే ఈ చిత్రం పొందనుండటం విశేషం. ఆద్యంతం జంతువుల నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వెంకటేశ్ నటించిన ‘బొబ్బిలి రాజా’ కూడా కొంతవరకు జంతువుల నేపథ్యంలో సాగుతుంది. మరి ఇదెలాంటి కథో చూడాలి. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే ఉంటుందని టాక్. వెంకటేశ్ కి బాగా నచ్చిన కథతో ఈ చిత్రం రూపొందనుందట. దర్శకుడు, మిగతా వివరాలు తెలియాల్సి వుంది.
 
అలాగే, దర్శకుడు పూరి జగన్నాథ్... వెంకటేశ్ కి ఓ కథ వినిపించాడట. ఆ కథ విషయంలో కూడా వెంకీ పాజిటీవ్ గా స్పందించినట్లు తెలిసింది. దీనితో పాటు తమిళ సూపర్ హిట్ మల్టీస్టారర్‘విక్రమ్ వేద’ సినిమాను అబ్బాయి రానాతో కలిసి చేయాలనుకుంటున్నాడట వెంకటేశ్. విక్టరీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here