చైతూని హిట్ వెతుక్కుంటూ వచ్చిందా?
on Jul 7, 2015
నాగచైతన్యను మరోసారి అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందా? స్టార్ డైరెక్టర్ చైతూతో మూవీ తేసేందుకు సై అన్నాడా? అంతా నాగార్జున మహిమేనా? అవునంటున్నారంతా. గౌతమ్ మీనన్ తో ఏం మాయచేశావే, సుకుమార్ తో 100% లవ్ తర్వాత చైతూనిక ఆ స్థాయిలో హిట్ లేదు. పాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం దక్కలేదు. విసుగుచెందిన సినీజనాలు సైతం చైతూని లైట్ తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన నాగ్... త్రివిక్రమ్ ని లైన్లో పెట్టాడట.
ఈ మధ్యే గీతదాటి మరో హీరో కోసం వెతుకుతున్న మాటలమాంత్రికుడు చైతూతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అప్పుడే కథ చెప్పేయడం ఓకే అయిపోవడం కూడా జరిగిపోయిందని.... త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఈ మధ్య డిజాస్టర్స్ తో డీలా పడిన చైతన్యకు...త్రివిక్రమ్ మంచి హిట్ ఇస్తాడనే ఆశతో ఉన్నాడు నాగ్. మరి నాగ్ కోరిక నెరవేరేనా? చైతూ ఖాతాలో మరో బంపర్ హిట్ పడుతుందా? ఇంతకీ పవన్, అల్లు అర్జున్, మహేశ్ ని దాటివచ్చిన త్రివిక్రమ్....చైతూకి ఎలాంటి కథ ఇస్తాడో? వెయిట్ అండ్ సీ!