పవన్ వద్దకు శిరిష్తో రాయబారం పంపిన బన్నీ
on Mar 20, 2017
"చెప్పను బ్రదర్" అన్న ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బద్ద శత్రువుగా మారిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలా పవన్, బన్నీ అభిమానుల మధ్య మొదలైన రచ్చ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాలు సోషల్ మీడియా సాక్షిగా యుద్దం మొదలెట్టాయి. ఈ యుద్ధంలో బన్నీ ఫ్యాన్స్ కంటే పవన్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందే ఉన్నారు. తమ అభిమాన నటుడిపై స్టైలిష్ స్టార్ ఆక్రోశం ప్రదర్శించడంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. రీసెంట్గా అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
దానికి సమానంగానే వచ్చిన డిస్-లైక్‌లు చూస్తే బన్నీపై పవన్ ఫ్యాన్స్ ఎంత కోపంతో ఉన్నారో అర్థమవుతోంది..ఇప్పుడే ఇలా ఉంటే..రేపు సినిమా రిలీజై..నెగిటీవ్ టాక్ బయటకు వచ్చిందంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన అల్లు ఫ్యామిలీ పవన్ ఫ్యాన్స్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కాటమరాయుడు ట్రైలర్‌పై స్పందించింది అల్లు కుటుంబం. అల్లు అర్జున్ తమ్ముడు హీరో అల్లు శిరీష్ ట్వీట్టర్ ద్వారా కాటమరాయుడుకి అభినందనలు తెలిపాడు..దీంతో డీజే కోసం అల్లు ఫ్యామిలీ దిగి వస్తోంది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు ఫిలింనగర్ జనాలు.