అప్పుడు గద..ఇప్పుడు గొడ్డలి
on Jul 7, 2017
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్..అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ను కట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ బాబీ. సరిగ్గా పరిశీలిస్తే టీజర్ చివర్లో గొడ్డలి పట్టుకుని జనాలను ఊచకోత కొస్తుంటాడు ఎన్టీఆర్..దానికి తగ్గట్టుగానే పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు..అది చూసిన అభిమానులు ఆహా..ఓహో అంటున్నారు..కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే కొద్ది సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్-హరీశ్ శంకర్ కాంభినేషన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా టీజర్ కూడా ఇలాగే అంచనాలను పెంచేసింది..దానిలో గద పట్టుకుని వస్తూ ఎవడు పడితే వాడు బుడ్డోడా బుడ్డోడా అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో మామూలుగా పేల్లేదు. ఇంకేముంది సినిమా సూపర్ హిట్ట్ అనుకున్నారు అంతా కానీ సినిమా రిలీజైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు హరీశ్ శంకర్‌పై కారాలు మిరియాలు నూరారు. మరి ఇప్పుడు కూడా అదిరిపోయే డైలాగ్స్‌తో, ఆకట్టుకునే గెటప్‌తో టీజర్ లాంచయ్యింది. మరి బాబీ కూడా హరీశ్ శంకర్ బాటలో నడుస్తాడో లేక ఎన్టీఆర్‌కు సూపర్‌హిట్ ఇస్తాడో వేచి చూడాలి.