క్రిష్‌ని చూసి రాజమౌళి కుళ్లుకుంటున్నాడా??
on Jan 27, 2017
కేవలం 79 రోజుల్లోనే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని పూర్తి చేసి, అనుకొన్న సమయానికే విడుదల చేయడంతో క్రిష్ పై అందరి దృష్టీ పడింది. అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు... టోటల్‌గా విమర్శకులు క్రిష్‌ని పొగుడుతూనే రాజమౌళిని టార్గెట్ చేయడం మొదలెట్టారు. అన్ని సీజీ వర్క్‌లు పెట్టుకొని, నాలుగు యుద్ధాలతో గౌతమిపుత్రని 79 రోజుల్లో తీస్తే.. క్రిష్ రెండేళ్ల పాటు ఒకే సినిమాని శిల్పంలా చెక్కుతున్నాడని, అనవసరంగా కాలయాపన చేస్తున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. క్రిష్ సినిమా ముందు బాహుబలి కోసం తాను పడిన కష్టం.. పెట్టిన పెట్టుబడి, ఇస్తున్న పబ్లిసిటీ అంతా చిన్నవిగా కనిపిస్తున్నాయిప్పుడు.
అందుకే... గౌతమిపుత్ర శాతకర్ణి సినిమానీ, అందుకోసం క్రిష్ పడిన కష్టాన్నీ రాజమౌళి బయటకు పొగుడుతున్నా... లోలోపల చాలా ఇబ్బంది పడుతున్నాడని, క్రిష్‌ని చూసి ఒకరకంగా జెలసీ ఫీలవుతున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రచారంలో రాజమౌళి కూడా పాల్గొన్నా... అంతర్గతంగా తనపై ఒత్తిడి ఎక్కువ అవుతోందని టాలీవుడ్ టాక్. ఇప్పుడు బాహుబలి 2 ని ఎంత గొప్పగా తీసినా.. క్రిష్‌తో పోలుస్తారని, 79 రోజుల్లో క్రిష్ ఇంత గొప్ప సినిమా తీసినప్పుడు రెండేళ్ల పాటు చెక్కి.. ఇలాంటి సినిమా తీయడంలో ఎలాంటి గొప్పదనం లేదని పుసుక్కున అనేస్తారేమో అని కంగారు పడుతున్నాడని గుసగుసలాడుకొంటున్నారు.
అందుకే ఈమధ్య రాజమౌళి.. క్రిష్‌ని ఇబ్బంది పెట్టేలా ట్వీట్టర్లో కొన్ని కామెంట్లు కూడా చేశాడని, ఆ కామెంట్ల వెనుక రాజమౌళి అక్కసు స్పష్టంగా కనిపిస్తోందని ఇండ్రస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రొఫెషనల్ జెలసీకి రాజమౌళి కూడా అతీతుడు కాడన్నమాట.