English | Telugu
Home  » Gossips

సందీప్ రెడ్డితో మహేశ్ కమిటయ్యాడా..? లేదా..?

on Feb 24, 2018

హీరోలు ఇలా కూడా ఉండొచ్చంటూ అర్జున్ రెడ్డితో.. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా. ఆ ఒక్క హిట్‌తో ఒక్కసారిగా స్టార్ హీరోలను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు. చాలా మంది ఈ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు పుకార్లు షికారు చేశాయి. కానీ అవన్నీ ఫేక్ న్యూసే అని తేలిపోయింది. అయితే సూపర్‌స్టార్ మహేశ్‌తో సందిప్ రెడ్డి సినిమా కన్ఫార్మ్ అయినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వచ్చాయి. ప్రిన్స్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను సందీప్ తయారు చేశాడని.. దీనికి మహేశ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరిగుతోంది. ఈ సినిమాలో మహేశ్ మెకానిక్ పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ టాక్.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చేస్తోన్న మహేశ్.. దీని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటించనున్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. అన్ని రెడీగా ఉన్న సందీప్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ ఈ మూవీ ఓకే అయితే గనుక ఇంట్రస్టింగ్ కాంభినేషన్ సెట్ అయినట్లే.
 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here