ఏ టైమ్‌లో స్టార్ట్ చేశావ్ చెర్రీ.. మరీ ఇన్ని బ్రేకులా..?
on Dec 8, 2017
ధృవ లాంటి సూపర్‌హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. ఆ సినిమా ఏ ముహూర్తాన బిగిన్ చేశాడో కానీ అన్నీ ఆటంకాలే. సమ్మర్లో హేవీ టెంపరేచర్ కారణంగా షూటింగ్ లేటైంది.. ఆ తర్వాత చెర్రీకి యాక్సిడెంట్ కావడం.. దాని నుంచి కోలుకోనేలోపు మెగాస్టార్ 151వ సినిమా సైరా పనుల్లో పడి రంగస్థలాన్ని మరచిపోయాడు చెర్రీ.. దీంతో దసరాకు రిలీజ్ అనుకున్న సినిమాను, దీపావళీకి అక్కడి నుంచి సంక్రాంతికి అన్నారు.. ఇప్పుడు ఏకంగా మార్చికి పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ సంగతి పక్కనబెడితే కనీసం ఫస్ట్‌లుక్‌కి కూడా దిక్కు లేకుండా పోయింది.
టైటిల్ పోస్టర్, షూటింగ్లో దిగిన సెల్ఫీలు తప్ప.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన సరైన పోస్టర్ ఒక్కటి కూడా లేదు. అయితే ఈ నెల 8 సాయంత్రం 5:30 గంటలకు ఫస్ట్‌లుక్ రిలీజ్ అంటూ తెగ హడావిడి చేసింది చిత్రయూనిట్. కానీ ఆ కాసేపటికే ఫస్ట్‌లుక్ రావడం లేదంటూ మరో ప్రకటన రావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు చెప్పిన డేట్‌కి కాకుండా ఒక రోజు ఆలస్యంగా అంటే డిసెంబర్ 9న ఉదయం 9 గంటలకు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నామన్నది ఆ ప్రకటన సారాంశం. దీంతో ఏ ముహూర్తంలో షూటింగ్ స్టార్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చెర్రీ, సమంతలు ఇంతకు ముందు ఏ సినిమాలోనూ కనిపించని లుక్‌తో ఈ సినిమాలో నిపించనున్నారట.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.