మహేష్ కి అక్కడ ఇక్కడ నేనే పోటీ అంటున్న బన్నీ
on Apr 15, 2017
వరుస ఫ్లాపులు పవన్ కళ్యాణ్ ఖ్యాతిని ఒక మెట్టు దించాయి. ఇంకో రెండు, మూడు సినిమాలు చేసి ఇంక రాజకీయాలకే తన ఫుల్ టైం కేటాయిస్తానని ఇదివరకే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మరి, పవన్ తర్వాత టాలీవుడ్ నం 1 స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అని పెద్ద డిబేట్ జరుగుతుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ కి అంత సీన్ ఉందని ఆయన అభిమానులు చెప్తుంటే, లేదు పవన్ తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు అని అతని అభిమానుల అభిప్రాయం. ఈ డిబేట్ కి అసలు కిక్ ఇచ్చే విషయం ఏంటంటే, మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారు. మహేష్ బాబు స్పైడర్ జూన్ 23 న విడుదలకి సిద్ధమౌతోంది.
బన్నీ దువ్వాడ జగన్నాధం ని కూడా అదే డేట్ కి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేళ ఆ డేట్ మిస్ అయితే, జులై 7 న డీజే రావొచ్చు అంటున్నారు. ఏది ఏమైనా, కొన్ని రోజులు అటు ఇటుగా ఇద్దరు హీరోలు తమ తమ చిత్రాల ద్వారా ప్రేక్షకులని అలరించడానికి ముందుకొస్తున్నారు. మొత్తానికి, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇంకో రెండు నెలల్లో క్లారిటీ రానుంది. కానీ, మనం మాత్రం తెలుగు సినిమా భవితవ్యం కోసం రెండు చిత్రాలు బాగా ఆడాలని కోరుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, స్పైడర్ తెలుగు, తమిళ్లో ఒకేసారి విడుదలవనుండగా, డీజే ని తమిళంలో డబ్ చేసి అదే డేట్ కి పక్క రాష్ట్రంలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. సో, పోటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళంలో కూడా అన్నమాట.