ఇదేంటి రాజమౌళి సీన్ రివర్స్ అయ్యింది!
on Apr 15, 2017
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి 2. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత దర్శకుడు రాజమౌళికి దక్కుతుంది. మొదటి పార్ట్ ని మించి రెండో పార్ట్ ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పినందువల్ల, సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో అద్భుత సన్నివేశాలు ఉండడం, బాహుబలి మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడం ఒక కారణం అయితే, కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనేది జనాలు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూడడానికి గల ప్రధాన కారణం.
మాములుగా అయితే, రాజమౌళి తన సినిమా మొదలెట్టగానే కథని జనాలకి చెప్పేసి ముందుగానే ఏం ఉండబోతుంది అని ఒక క్లారిటీ ఇచ్చి, తనదైన శైలిలో సినిమా తీసి అభిమానులకి డబుల్ బొనాంజా ఇచ్చేవాడు. అయితే, బాహుబలి విషయంలో తన పంథా మార్చి కథని గోప్యాంగా ఉంచారు. ఒక విధంగా చెప్పాలి అంటే, కథలో ట్విస్ట్ ఉంది కాబట్టే రాజమౌళి అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ఏ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. ఈ సారి కథ బయటకి లీక్ అయ్యి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి కూడా కథ ఇంచు మించు అలాగే ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత సీక్రెట్ గా ఉంచుకుందాం అనుకున్నా ఔత్సాహికుల పుణ్యమా అని అది సాధ్యపడలేదు. కథ బయటకి పొక్క డానికి లోపలి వర్గం కుట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత స్టోరీ లీక్ అయినా, రాజమౌళి గ్రాండ్ విజువల్స్ తో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు!
Also Read