ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ బాహుబలి-2ని ముంచుతుందా..?
on Apr 14, 2017
తెలుగు సినిమాతో ప్రపంచ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి-2 విడుదలకు సమయం ఎంతో లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 28న బాహుబలిని విడుదల చేయాలని నిర్మాణాంతర కార్యక్రమాల్ని పరుగులెత్తిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమా మీద అంచనాలు మరింత పెంచుతున్నాయి. దానికి తోడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలికి భయపడి చిన్నా, పెద్ద సినిమాలు వెనక్కో, ముందుకో జరిగిపోయాయి.
సరే అంతా బాగానే ఉంది కానీ ప్రమోషన్ కార్యక్రమాలే వీక్‌గా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. బాహుబలి ది బిగినింగ్ విషయంలో అద్భుతమైన ప్రమోషన్ స్ట్రాటజీతో కలెక్షన్లు వర్షం కురిపించి శభాష్ అనిపించుకున్నాడు రాజమౌళి. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి పుట్టిన రోజుకి ఏదో ఒక పోస్టరో, మేకింగ్ వీడియోనో లేక మరోకటో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకేత్తించారు అది మూవీకి బాగా ప్లస్ అయ్యింది. కానీ బాహుబలి-2కి వచ్చేసరికి ఏందుకో జక్కన్న సైలెంట్ అయిపోయాడు. ప్రి రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్‌గా చేయడం, నటీనటులపై టీజర్, ట్రైలర్ తప్పించి పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. అటు నిర్మాతలు కూడా రాజమౌళి ఉన్నాడు కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే ఇంతటి ఓవర్ కాన్ఫ్‌డెన్స్ అసలుకే మోసం తెస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోందో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.