ఆయనే వద్దనుకుంటే... బాలకృష్ణకి దిక్కేది?
on Mar 25, 2017
నటసింహ నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని సినిమాగా తీస్తానని చెప్పిన విషయం మనందరికీ విదితమే. అయితే, ఈ చిత్రానికి ఒక సీనియర్ దర్శకుడు అయితే బాగుంటుందని బాలకృష్ణ ప్రయత్నాలు మొదలు పెట్టాడు, ఎందుకంటే ఎన్టీఆర్ లైఫ్ ని చెప్పాలంటే ఆషామాషీ విషయం కాదు. ఈ ప్రయత్నంలో భాగంగా, బాలకృష్ణ రాఘవేంద్ర రావు గారిని కలిసి దర్శకత్వం వహించాల్సిందిగా కోరాడట. కానీ, రాఘవేంద్ర రావు దీనికి నో చెప్పాడట.
కారణం ఏంటంటే, సినిమాలో ఏదైనా అభ్యంతకర సన్నివేశాలు ఉంటే, రాఘవేంద్ర రావే బాధ్యత వహించాల్సి ఉంటది. వేరే వాళ్ళ విషయం పక్కన పెడితే, టీడీపీ ప్రతిష్ట దెబ్బ తీసేలాగా ఉంటే, దర్శకేంద్రుడు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటది. రాఘవేంద్ర రావు టీటీడీ బోర్డు లో సభ్యుడన్న విషయం మనకు తెలిసిందే. ఏ మాత్రం తేడా వచ్చిన ఆయనకి పదవికి గండం ఉండే అవకాశం ఉంది. దానికి తోడు, పార్టీ ఆయనని పక్కన పెట్టిన పెట్టొచ్చు. అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు కాబట్టి రాఘవేంద్ర రావు గారు బాలక్రిష్ణని ఈ విషయంలో బలవంత పెట్టొద్దని చెప్పాడట. ఈయన వద్దన్నారు సరే, మరి వేరే వాళ్ళు అంత రిస్క్ తీస్కొని ఈ సినిమా చేయడానికి ముందుకొస్తారా అనేది పెద్ద ప్రశ్న? చూద్దాం, బాలకృష్ణ తన నిర్ణయం మార్చుకుంటాడా లేక ఇంకెవరినైనా సంప్రదిస్తాడా?