ఆ మూడు హిట్టేనంట..!
on Aug 22, 2014
టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్‌గా పేరొందిన దిల్ రాజుకు ఈ మధ్య కాలం కలిసిరావడం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉంటాడనే పేరున్న దిల్ రాజు గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. వరుసగా అగ్ర హీరోల సినిమాలను నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న దిల్ రాజుకి అదృష్టం కొద్దీ డల్ పీరియడ్‌లో ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన మూడు చిన్న సినిమాలు క్లిక్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. రన్ రాజా రన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగా, గీతాంజలి.. లవర్స్ సినిమాలకి రివ్యూస్ సరిగ్గా రాకపోయిన కామెడీతో బాక్సాఫీస్‌ని గెలిచాయి. ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు స్టెడీగా ఉన్నాయట. దీంతో తన గోల్డెన్ టైమ్ మళ్ళీ స్టార్ట్ అయిందని దిల్ రాజు భావిస్తున్నాడట.