English | Telugu
Home  » Gossips

నాని ఇంతమంది హీరోయిన్లని ఎలా పడేశాడు..?

on Feb 15, 2018

వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని నిర్మిస్తోన్న మూవీ "అ!". ప్రశాంత్ వర్మ ఏం చెప్పాడో.. అందులో అంతగా ఏం నచ్చిందో తెలియదు గానీ... నిర్మాతగా మారిపోయాడు నేచురల్ స్టార్. అదే పెద్ద సర్‌ప్రైజ్ అనుకుంటే టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ కాజల్‌తో పాటు నిత్యామీనన్, రెజీనా, ఇషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుసుకున్న సినీ జనాలు ఉలిక్కిపడ్డారు.. వీరితో పాటు మాస్ మహారాజ్ రవితేజ వాయిస్ ఓవర్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఒక సినిమాకు ఒప్పించడం మామూలు విషయం కాదు.

వీరిలో నిత్య మీనన్, శ్రీనివాస్ అవసరాల నానికి బాగా సన్నిహితులు.. అతని మాట కాదనలేక వారు ఒప్పుకున్నారు అనుకున్నా.. మరి మిగిలిన వారి సంగతి ఏంటీ..? స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ డేట్స్ సర్దుబాటు చేయలేక చాలా సినిమాలను వదిలేసుకుంది. మరి అలాంటి కాజల్ ఈ సినిమాకు ఎలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. "బయట పార్టీల్లోనూ.. మూవీ ఈవెంట్లలోనూ నానితో నేను పెద్దగా మాట్లాడింది కూడా లేదు.. మేం ఒకసారి మాత్రమే కలిసినట్టు గుర్తు.." అని కాజల్ ట్వీట్ చేయడం.. ఫిలింనగర్‌లోనూ... సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. కథ డిఫరెంట్‌గా ఉండటం... క్యారెక్టర్లు నచ్చడం వల్లే వీరంతా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని మెజారిటీ జనాలు వాదిస్తున్నారు. మరి వీరిని ఒప్పించింది నాని మంచితనమా..? లేక కథలో ఉన్న క్లారిటీనా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here