అమ్మో ఆంటీ ఏంటిది ??
on Jul 28, 2016
హాలీవుడ్, బాలీవుడ్ లలో అంటే పెళ్ళయక కూడా బికినీలు వేసేసుకోని హాట్ హాట్ గా కనిపిస్తూ హల్ చల్ చేయడం కామన్. కానీ.. మన తెలుగు చిత్రసీమకు సంబంధించినంతవరకూ పెళ్ళైన తర్వాత ఎంత పాపులర్ హీరోయిన్ అయినా సరే కుదురుగా ఉండకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో కానీ ఆడియన్స్ మరియు వారి అభిమానులు మాత్రం నిప్పులుగక్కుతారు. అందుకే పెళ్ళాయ్యాక మహా అయితే ఏవైనా క్యారెక్టర్ రోల్స్ లేదా సీరియల్స్ లో నటిస్తూ ముందుకెళుతుంటారు మన కథానాయికలు.
కానీ.. హాట్ యాంకర్ టర్నడ్ యాక్ట్రెస్ అనసూయ మాత్రం "నేను అలాంటి తొక్కలో రూల్స్ ఫాలో అవ్వను" అంటూ ఇదివరకూ వైట్ డ్రెస్ లో మాంచి రోమాంచితమైన ఫోటోలు తీయించుకొని మీడియాకి వదిలింది. ఆ ఫోటోల్లో ఉన్న సెక్సీనెస్ ను జనాలు ఇంకా మరువక ముందే మరింత సూపర్ హాట్ ఫోటోలను మళ్ళీ వదిలింది. ఈసారి తన నడుమండాలను కూడా కాస్తంత ప్రదర్శించింది. మరి అనసూయ పడుతున్న ఈ శ్రమకు తగ్గ ఫలితం ఏదైనా మంచి సినిమా ఆఫర్ తో లభిస్తుందేమో చూడాలి!