English | Telugu
Home  » Gossips

అధైర్యపడొద్దు.. త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్ ఫోన్..?

on Jan 12, 2018

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసి ఆ అంచనాలను అందుకోవడంలో అట్టర్ ఫ్లాపైంది. ఏదో అనుకుంటే ఇంకేదో స్క్రీన్‌ మీద కనిపించడంతో ప్రేక్షకులు దానిని రీసీవ్ చేసుకోలేకపోయారు. దాని ఫలితంగా మ్యాట్నీ నుంచి అజ్ఞాతవాసి థియేటర్లలో ఆడియన్స్ బాగా పలచబడ్డారు. ఇక దీనికంతటికి కారణంగా త్రివిక్రమ్‌ను దోషిగా తేల్చి సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇక అజ్ఞాతవాసి ఎఫెక్ట్ త్రివిక్రమ్ తర్వాత తీయబోతున్న ఎన్టీఆర్ సినిమాపై పడింది. ఇప్పటికే కాస్త జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌కి మెసేజ్‌లు పెడుతున్నారట నీ సినిమాను ఏం చేస్తాడోనని. అవసరమైతే సినిమా నుంచి తప్పుకోవాలని సలహాలు ఇస్తున్నారట.

ఇలా అందరికి త్రివిక్రమ్ కార్నర్‌గా మారిన పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఆయనకి ఫోన్ చేశారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. మాటలు రాని.. పుకార్లు వినిపించని నేను మీతోనే సినిమా చేస్తున్నా.. ఫ్లాప్ విషయం మర్చిపోయి కొత్త సినిమా కోసం హాయిగా పనిచేయండి అని ధైర్యం చెప్పారట. ఎన్టీఆర్ మాటలతో త్రివిక్రమ్ కూడా కాస్త నార్మల్ మూడ్‌లోకి వచ్చారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. త్రివిక్రమ్‌ అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకుంటారని సినీ జనాలు అంటున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here