చరణ్ తో బోయపాటి రొమాంటిక్ కామెడీ..!
on Apr 2, 2014
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బోయపాటి శ్రీనుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ కాదని రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. బోయపాటి శ్రీను 'లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించడంతో ఆ సినిమా విజయయాత్రలో బిజీగా వున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ పై పనిచేయనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్లతో సినిమా చేస్తారట, ఆ తరువాత బోయపాటితో సినిమా వుంటుందని అంటున్నారు.