వారిద్దరికీ... బన్నీ క్లాస్ తీసుకోనున్నాడా?
on Feb 5, 2018
బన్నీకి కోపం వచ్చింది. కోపం తెప్పించిన వ్యక్తులకు మీటింగ్ పెట్టి మరీ క్లాస్ పీకబోతున్నాడు. ఫిలింనగర్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇంతకీ బన్నీ కోపానికి కారణం ఏంటి? బన్నీకి కోపం తెప్పించిందెవరు? అనే వివరాల్లోకెళ్తే... బన్నీకి కోపం తెప్పించింది ఎవరో కాదట... సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్. వీరిద్దరి సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల అవుతుండటమే... బన్నీ కోపానికి కారణమట. అందుకే... మెగా హీరోలందరితో ఓ మీటింగ్ పెట్టి మరీ వరణ్, సాయిథరమ్ లకు క్లాస్ పీకనున్నాడట బన్నీ.
మెగా ఫ్యామిలీలో ఉన్నంతమంది హీరోలు ఏ సినిమా కుటుంబంలోనూ లేరన్నది నిజం. అందుకే... సినిమాల విడుదల విషయంలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంటారు ఈ హీరోలు. కనీసం రెండు వారాల గ్యాప్ అయినా సరే... వీరి సినిమాల మధ్య ఉండాలి. ఇప్పటివరకూ అలాగే జరిగింది కూడా. అయితే... తొలిసారి మెగా హీరోలైన సాయిధరమ్, వరుణ్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఒక రోజు తేడాతో సాయిధరమ్ ‘ఇంటిలిజెంట్’, వరుణ్ ‘తొలిప్రేమ’ సినిమాలు విడుదల కానున్నాయ్.
ఈ పరిణామం మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదట. బన్నీ కోపానికి అదే కారణం అయ్యింది. క్రమశిక్షణగా ...ఓ పద్ధతి ప్రకారం ముదుకెళ్తున్న తమ మధ్య ఇలాంటి పోటీలు... అనవసరపు సమస్యలు తలెత్తేలా చేస్తాయని బన్నీ పలువురితో వాపోయాడని ఫిలింనగర్ టాక్.
తమలో తామకు పోటీలు మొదలైతే... అది కుటుంబానికి అంత మంచిది కాదనీ... ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురు కాకుండా చూసుకోవాలని బన్నీ ఈ మీటింగ్ లో సూచించనున్నట్లు సమాచారం. మెగా హీరోల సినిమాలంటే... ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయ్. సినిమా ఫ్లాపైనా... ఓపెనింగ్స్ వల్ల గట్టేక్కేయొచ్చు. కానీ ఇలా ఒకేసారి ఇద్దరు మెగా హీరోల పోటీ పడితే... అటు ఓపెనింగులూ రావు. సరైన టాక్ రాని సినిమాకు భారీ నష్టాలు వాటిల్లుతాయ్. ఇది నిర్మాతలకు కూడా మంచిది కాదనేది పలువురి అభిప్రాయం. అయితే... ఇందులో సాయిధరమ్, వరుణ్ ల ప్రమేయమేం లేదనీ...నిర్మాతలు పట్టుపట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందనీ కొందరంటున్నారు. అదండీ విషయం.