మామ వెంకీ, అల్లుడు చైతూతో మల్టీస్టారర్
on Oct 24, 2017
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తన మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. తన తదుపరి చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం తో రెండో హిట్ కొట్టిన కళ్యాణ్, త్వరలో రవి తేజ తో ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇది సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ బంగార్రాజు అని ప్రచారం జరుగుతుంది. అయితే, ఇందులో వాస్తవం లేదు అని తెలిసింది. రవి తేజ తో చేయనున్న సినిమాకి కళ్యాణ్ కృష్ణ కొత్త కథని ఎన్నుకున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇదిలా ఉంటే, కళ్యాణ్ కృష్ణ వెంకటేష్, నాగ చైతన్య తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఒక కథ సెట్ చేసాడట. ఈ మధ్యే వెంకటేష్ కి వినిపిస్తే ఓకే చేసాడట. మామయ్యతో కలిసి పనిచేయడానికి నాగ చైతన్య సైతం ఉవ్విల్లూరుతున్నాడట. కళ్యాణ్ కృష్ణ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా ఫామిలీ ఎంటర్ టైనర్ అని తెలిసింది. కామెడీ ప్రధానంగా ఉండే ఈ చిత్రం 2018 చివర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్య హిట్ సినిమా ప్రేమంలో వెంకటేష్ క్యామియో రోల్ చేసిన విషయం మనందరికీ విదితమే!
Also Read