పవన్ టైటిల్ కొట్టేసిన నితిన్?
on Jul 13, 2017
పవన్ కళ్యాణ్ తొలి సినిమా పేరేంటి? ఈ ప్రశ్న ఏ అభిమానిని అడిగినా ఠక్కున చెప్పేస్తాడు ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అని. త్వరలో ఈ టైటిల్ తారుమారు అవ్వబోతోంది. అదేలాగంటే... ‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’.. అలా అన్నమాట.
ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు.. అందులో ఒకరు ఎవరో తెలుసా? ఇంకెవరూ మన పవర్ స్టారే. ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ నిర్మాత కాగా, హీరో నితిన్ తండ్రి, ప్రపంణీదారుడు సుధాకర్ రెడ్డి మరో నిర్మాత. కృష్ణచైతన్య దర్శకుడు. త్రివిక్రమ్ మూల కథ అందించిన ఈ చిత్రం ప్రారంభోత్సవం కొన్ని రోజుల క్రితం జరిగింది. అప్పుడు ఈ సినిమాకు టైటిల్ అనుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ‘అక్కడ అబ్బాయి .. ఇక్కడ అమ్మాయి’ అని పేరు పెట్టినట్టు సమాచారం. టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.
‘లై’ సినిమా కోసం గడ్డం పెంచిన నితిన్... ఈ సినిమా కోసం తన పాత రూపానికి వచ్చేయనున్నారు. కథ రిత్యా ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలట. అందుకని జిమ్ లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు నితిన్. తన అభిమాని హీరోగా సినిమా నిర్మించడమే కాకుండ... తన టైటిల్ ని కూడా నితిన్ కి ఇచ్చేసి, పవర్ స్టార్ తన పెద్ద మనసును చాటుకున్నారు కదూ! త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read