అదిరిపోయే హిట్టిచ్చినా క్రిష్‌పై బాలయ్య ఆగ్రహం ఎందుకు..?
on Feb 3, 2017
ఏ హీరోకైనా 100వ సినిమా అంటే అదో మైలురాయి..దానిని తీపి జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంటారు కథానాయకులు. కానీ అది అందరికి సాధ్యమయ్యేది కాదు. ఎవరో ఒకరికి మాత్రమే అలాంటి అదృష్టం దక్కుతుంది. ఈ విషయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ అదృష్టవంతుడనే చెప్పాలి..ఆయన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా కుమ్మేస్తోంది. దీంతో చిత్రయూనిట్ అంతా ఫుల్ హ్యాపీ..కానీ ఒక్క బాలయ్య మాత్రం కోపంగా ఉన్నాడట.
ఈ సంక్రాంతికి శాతకర్ణితో పాటు విడుదలైన ఖైదీ నెం.150, శతమానం భవతి సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి..వాటి కలెక్షన్లను ఆయా చిత్ర నిర్మాతలు మీడియాకు విడుదల చేస్తూ సక్సెస్మీట్లు నిర్వహిస్తున్నారు..కానీ శాతకర్ణి దర్శకనిర్మాతలు మాత్రం అసలు ఈ విషయాన్నే పట్టించుకోవడం లేదట..సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టే హిట్టా...ఫ్లాపా అనే అంచనా వేస్తున్న ఈ రోజుల్లో కలెక్షన్లను అధికారికంగా వెల్లడిచేయకపోతే ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందని బాలయ్య భావిస్తున్నారట..అందుకే క్రిష్‌పై కాస్త కోపంతో ఉన్నారని ఫిలింనగర్ టాక్.