బాబుతో పాప రొమాన్స్ లేనట్లే..!!
on Jul 18, 2016
వెంకటేష్ తో మారుతి తెరకెక్కిస్తున్న "బాబు బంగారం" సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయిన విషయం తెలిసిందే. ఆ ఒక్క పాట చిత్రీకరణ పూర్తి చేద్దామంటే డేట్స్ కారణంగా నయనతార సహకరించకపోవడం వల్ల ఆ పాటను మాత్రం షూట్ చేయలేకపోతున్నారు. తొలుత జూలై 1, తర్వాత 15, 29 ఇలా పలు తేదీలు మారిన అనంతరం ఎట్టకేలకు ఆగస్ట్ 12న సినిమా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక కూడా నయనతార సాంగ్ షూట్ కి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుండడంతో ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేసేద్దామని దర్శకనిర్మాతలు ఫిక్సయ్యారట.
వెంకీ - నయనతార మునుపటి చిత్రాలైన "లక్ష్మీ, తులసీ"లలో వారిమధ్య వచ్చే రోమాంటిక్ సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. అందుకే "బాబు బంగారం"లోనూ ఆ తరహా పాటను డిజైన్ చేశారు. కానీ.. నయనతార కేటాయించిన డేట్స్ అయిపోవడం, మారుతి సరిగా ప్లాన్ చేసుకోకపోవడం కారణంగా ఆ రోమాంటిక్ సాంగ్ ను ఆడియోలో ఉంచి.. సినిమాలో మాత్రం కనిపించనివ్వరంట. ఈ వార్త మాస్ సినిమా అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించేదే కానీ.. వెంకీ కామెడీతో ఆ లోటును తీరుస్తాడేమో చూడాలి!