బాబోయ్ అనిపిస్తున్న "బాహుబలి"!
on Jul 14, 2016
"బాహుబలి" విడుదలై ఏడాది ముగుస్తున్నా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు "బాహుబలి 2" వంతు వచ్చింది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్పుడే ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గతేడాది "బాహుబలి" హిందీ వెర్షన్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడుపోవడమే చిన్నసైజు సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు "బాహుబలి 2" ఆ రికార్డ్ ను బ్రేక్ చేయనుంది.
"బాహుబలి 2" తమిళ వెర్షర్ రైట్స్ ఏకంగా 54 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. ఓ భారీ తమిళ నిర్మాణ సంస్థ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి "బాహుబలి 2" తమిళ రైట్స్ ను దక్కించుకొన్నట్లు సమాచారం. అయితే.. కేవలం సినిమా రైట్స్ మాత్రమే కాకుండా ఆడియో, వీడియో మరియు శాటిలైట్ రైట్స్ కూడా అందులో భాగమాట. ఓ తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ కు ఇంత భారీ స్థాయిలో రేటు పలకడం ఇదే మొట్టమొదటిసారి.. ఆఖరుసారి కూడా అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు!