అల్లు హీరోపై అల్లరోడి సెటైర్లు!
on Jul 11, 2016
"సరైనోడు" విజయోత్సవ వేడుకల్లో పవర్ స్టార్ ప్రస్తావన వచ్చినప్పుడు బన్నీ "చెప్పాను బ్రదర్" అని అన్న ఒక్కమాటకి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆఖరికి అల్లు అర్జున్ "ఒక మనసు" ఆడియో వేడుకలో దాదాపు 15 నిమిషాల స్పీచ్ ఇచ్చి మరీ ఈ విషయంపై వివరణ ఇచ్చుకొన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ "చెప్పాను బ్రదర్" గొడవ సర్ధుమణుగుతుందనుకొంటున్న సమయంలో అల్లరి నరేష్ మరీ ఆ ఆరుతున్న నిప్పుకు ఆజ్యం పోస్తున్నాడు.
విషయం ఏంటంటే.. అల్లరి నరేష్ తాజా చిత్రం "సెల్ఫీ రాజా" ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు ఆ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అల్లరి నరేష్ మునుపటి చిత్రాల తరహాలోనే స్పూఫ్ లతో నిండిపోయిన ఈ ట్రైలర్ చివర్లో విలన్ క్యారెక్టర్ పృధ్వీని "ఎవడ్రా నువ్వు" అని అడగ్గా... అవతల ఉన్న పృధ్వీ "చెప్పాను బ్రదర్" అంటాడు. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి అన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!