గోవా బ్యూటీ గుట్టుగా కాపురం చేసేస్తోందా??
on Jul 4, 2016
పూర్వం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడానికి కూడా భయపడి చచ్చేవారు. అలాంటిదిప్పుడు సహజీవనం చేస్తున్నాం అని కూడా చాలా సరదాగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. అయితే.. స్ట్రయిట్ గా చెప్పలేదు కానీ.. దాదాపుగా తాను "లివ్ ఇన్ రిలేషన్" లో ఉన్నానని కన్ఫర్మ్ చేసేసింది బెల్లీ బ్యూటీ ఇలియానా.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. "ఉదయాన్నే చెదిరిన జుట్టుతో నన్ను చూడడం ఆండ్రూకి చాలా ఇష్టం" అని సమాధానమిచ్చేసి నాలుక్కరుచుకొంది ఇల్లీ బేబీ. కలిసి ఉంటే తప్ప.. రోజు ఉదయాన్నే ఇలియానా చెదిరిన జుట్టును చూడడం ఆండ్రూకి సాధ్యం కాదు కాబట్టి.. వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు జనాలు!