ప్రభాస్ ప్రవర్తనే అందుకు కారణమా ?
on Jul 4, 2016
ఈమధ్యకాలంలో తెలుగు సినిమాకి సంబంధించి జరిగిన అన్నీ అవార్డ్ వేడుకల్లోనూ "బాహుబలి" సినిమా హల్ చల్ చేసింది. రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డులు, రాణాకి ఉత్తమ ప్రతినాయకుడు, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ సినిమాటోగ్రఫీ.. ఇలా చాలా శాఖల్లో "బాహుబలి" సినిమాకి అవార్డుల పంట పండింది. కానీ.. కథానాయకుడు ప్రభాస్ కు మాత్రం మచ్చుకకైనా ఒక్క అవార్డ్ కూడా లభించలేదు. "మిర్చి" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో సినిమా చేయకుండా ఏకంగా మూడేళ్లపాటు మరో సినిమా చేయకుండా "బాహుబలి"కే బల్క్ డేట్స్ ఇచ్చేయడంతోపాటు.. తన పెళ్ళికి సైతం పక్కన పెట్టేసి షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాంటి ప్రభాస్ కు ఇప్పటివరకూ ఏ అవార్డ్ వేడుకల్లోనూ ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లభించకపోవడం గమనార్హం.
ఈ విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. సినిమా తీసింది రాజమౌళే అయినా సినిమా ఆడింది మాత్రం మా హీరో స్టామినా వల్లే.. అలాంటిది మా హీరోకి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం ఏంటి? అని ప్రభాస్ అభిమానులు ఆన్ లైన్ లో "బాహుబలి" టీం ను ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ పబ్లిక్ ఫంక్షన్లకు రావడానికి ఇష్టపడడు. తనకు మరీ సన్నిహితులైతే తప్ప కనీసం ఆడియో వేడుకలకు సైతం హాజరవ్వడానికి సుముఖత చూపాడు ఈ ఆరడుగుల అందగాడు. అలాంటిది గంటల తరబడి సాగే అవార్డ్ వేడుకలకు వచ్చి ఓపిగ్గా ఎంతసేపు కూర్చుంటాడు చెప్పండి. సో, ప్రభాస్ రావట్లేదు కాబట్టి అవార్డు ఫంక్షన్ నిర్వాహకులు కూడా ప్రభాస్ ను పట్టించుకోవట్లేదాని వినికిడి!