‘ఒక లైలా కోసం’ సెన్సార్ రిపోర్ట్
on Aug 27, 2014
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చింది. నాగాచైతన్య, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలీ, షాయాజీ షిండే, రోహిణి, సుమన్, సుధ, చలపతిరావు, ఎం.ఎస్. నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.