సునీల్ కి హీరోయిన్ దొరికింది
on Jan 20, 2015
ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో త్రిషకు చెల్లెలి పాత్రలో నటించిన సంజనకు టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. సంజనకే టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగా వున్నాయనుకుంటే, ఇపుడు సంజన సిస్టర్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తోంది. తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ, నటిగా బిజీగా వున్న సంజన సిస్టర్ నిక్కి గార్లనికి తాజాగా ఓ క్రేజి ప్రాజెక్టులో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సునీల్ హీరోగా నిర్మాత దిల్ రాజు ఓ చిత్రం నిర్మించనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ సరసన హీరోయిన్ గా నిక్కి గార్లనిని ఎంపిక చేసారు. ఇటీవలే ఈ అమ్మడు నటించిన తమిళ 'డార్లింగ్' చిత్రంలోని నిక్కి నటన చూసి, దర్శక నిర్మాతలు ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చినట్లుగా తెలిసింది. 'జోష్' ఫేం దర్శకుడు వాసు వర్మ ఈ చిత్రాన్ని త్వరలో తెరకెక్కించనున్నాడు.