నానికి ఎనిమిది కోట్లా?
on Jul 13, 2017
నానికి ప్రస్తుతం గోల్డెన్ పిరియడ్ నడుస్తోంది. తను పట్టిందల్లా బంగారం అయిపోతోంది. ఇప్పటికే దాదాపు వరుసగా ఆరు విజయాలను అందుకున్న నాని... ‘నిన్ను కోరి’తో వరుసగా ఏడో హిట్ కూడా ఇచ్చేశాడని ట్రేడ్ టాక్. ఇప్పుడున్న ఏ హీరో కూడా చేయని ఫీట్ ఇది. ఆ విషయంలో నానిని గ్రేట్ అనక తప్పదు. దీంతో తన రెమ్యునరేషన్ని కూడా నాని అమాంతం పెంచేశాడని టాక్. నాని సినిమాకు ఇప్పటివరకూ 20 కోట్ల బిజినెస్ జరుగుతోంది. దాంతో తను అయిదు కోట్ల దాకా పారితోషికం అడుగుతున్నట్లు టాక్. అయితే... నేను లోకల్ చిత్రం 25 కోట్ల పైనే వసూలు చేసింది. ‘నిన్న కోరి’ కూడా 20 కోట్ల పైగానే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ టాక్. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాని 8 కోట్ల దాకా పారితోషికాన్ని అడుగుతున్నట్టు సమాచారం. దీంతో తన తోటి హీరోలను అధిగమించడమే కాక, రవితేజ కంటే ఎక్కువ పారితోషికాన్ని నాని డిమాండ్ చేస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. కొసమెరుపు ఏంటంటే... నానికి, ఎనిమిది కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడటం లేదట. ఆయనగారి సుడి అలా ఉంది మరి.